Janasena : జనసేనను దెబ్బ తీసేందుకు భారీ కుట్ర..కనిపెట్టిన పవన్
- By Sudheer Published Date - 08:42 PM, Tue - 6 February 24

ఎన్నికలు వస్తున్న సమయంలో చాల జాగ్రత్తగా వ్యవహరించాలి..ఎలాంటి చిన్న తప్పు జరిగిన..చేసినా అది పార్టీకే పెద్ద మైనస్ గా మారుతుంది. ముఖ్యంగా డబ్బు…టికెట్లను అమ్ముకుంటున్నారని..డబ్బులు పెట్టినవారికి టికెట్స్ ఇస్తున్నారని..ఇచ్చారని ..డబ్బు ఉన్న వారికే పార్టీ లో గుర్తింపు అని , వారికీ మాత్రమే పార్టీ టికెట్స్ కేటాయిస్తుందని ఇలా అనేక విమర్శలు వస్తుంటాయి. ఇలాంటి వాటికీ దూరంగా ఉండాలి..అప్పుడే ప్రజల్లో , పార్టీలో కష్టపడినా వారికీ ఓ నమ్మకం అనేది ఉంటుంది. తాజాగా కొంతమంది జనసేన ఫై ఇలాంటి విమర్శలు చేయాలనీ ప్లాన్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
పార్టీ టికెట్ ఇస్తే కోట్ల రూపాయిలు ఇస్తామని చెప్పి చెక్ లు పంపించారు. కానీ ఇక్కడ ఉన్నది పవన్..ఆయన చూడని డబ్బా..అలాంటి ఆయనకే డబ్బు ఆశ చూపి రాజకీయంగా ఆయన పరువు తీయాలని కొంతమంది ట్రై చేసారు. కానీ పవన్ అందరిలాంటి వాడు కాదని నిరూపించుకున్నాడు. కోట్ల రూపాయిలు ఇస్తామని చెక్ లు పంపించిన వారికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. వీటిని వెనక్కి పంపాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పార్టీలో లేకుండా చెక్కులు ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనసేనను దెబ్బ తీసేందుకే ఇలా చేస్తున్నారని భావించారు. ఇతర పార్టీల వారికి టికెట్లు ఇచ్చేది లేదని.. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డవారికే సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యాయనని తేల్చి చెప్పారు.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇలాంటి విమర్శలే చేసారు. కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేసి చిరంజీవి పరువు తీశారు. ఇప్పటికే చిరంజీవి ని కొంతమంది ఆ విమర్శలే చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా అలాగే చేయాలనీ అనుకున్నారు కానీ వారి ప్లాన్ ను ముందే కనిపెట్టి పవన్ జాగ్రత్త పడ్డాడు.
Read Also : Thalapathy Vijay : విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఫై ఉపాసన ఇంట్రస్టింగ్ కామెంట్స్