AP : రోజా అనే మాటలు వీరికి తెలియవా..? అందుకే సపోర్ట్ చేస్తున్నారా..?
వీరు ఇలా సపోర్ట్ చేయడం తప్పు కాదు..కానీ అసలు రోజా ఎలా మాట్లాడుతుందో..ఎలాంటి బూతులు మాట్లాడుతుందో వారికీ తెలియక ఇలా సపోర్ట్ చేస్తున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
- By Sudheer Published Date - 12:43 PM, Sun - 8 October 23

వైసీపీ మంత్రి RK రోజా (RK Roja) ను టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana Murthy) పలు విమర్శలు చేసారని..పలువురు సీనియర్ సినీ తారలు గగ్గోలు పెడుతున్నారు. ఓ మహిళా అని కూడా చూడకుండా ఆలా ఎలా మాట్లాడతారు అంటూ సోషల్ మీడియా వేదికగా బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, నిప్పులు చెరుగుతున్నారు. అమరావతి లోక్ సభ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ , కవిత, మీనా, రమ్యకృష్ణ వంటి వారు స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే వీరు ఇలా సపోర్ట్ చేయడం తప్పు కాదు..కానీ అసలు రోజా ఎలా మాట్లాడుతుందో..ఎలాంటి బూతులు మాట్లాడుతుందో వారికీ తెలియక ఇలా సపోర్ట్ చేస్తున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. రోజా ఎలాంటిదో..ఎలా మాట్లాడుతుందో..తెలిసే ఆమె పక్కన ఉండే సొంత పార్టీ మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని అంటున్నారు. చంద్రబాబు , లోకేష్ , నారా భువనేశ్వరి , నారా బ్రహ్మణి , పవన్ కళ్యాణ్ ఇలా చాలామందిని చాల దారుణంగా రోజా మాట్లాడిందని అవన్నీ వీరికి చూపిస్తే ఛీ..ఇలాంటి మాటలు అన్న రోజాకా మీము సపోర్ట్ ఇచ్చాం..అని బాధపడతారని అంత అంటున్నారు. ఇప్పటికైనా రోజా కు సపోర్ట్ చేసినవారు..చేయాలనీ అనుకునేవారు ఒక్కసారి రోజా వీడియోస్ చూసి ఎవరికీ సపోర్ట్ ఇవ్వాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.
Read Also : Taliban – Amitabh : అమితాబ్ తో మాకు అవినాభావ సంబంధం.. తాలిబన్ల ట్వీట్ వైరల్