Gorantla Butchaiah Chowdary : ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల..
అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందిన బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు
- By Sudheer Published Date - 11:06 AM, Wed - 19 June 24

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ (Pro-Tem Speaker)గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ఎంపికయ్యారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ నెల 21 , 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందిన బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దీనికి ఆయన ఒప్పుకోవడం తో బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 60 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
We’re now on WhatsApp. Click to Join.
బుచ్చయ్య చౌదరి..టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత చిన్న అన్నగా బుచ్చయ్య చౌదరిని టీడీపీ శ్రేణులు పిలుస్తుంటారు. పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత ఈయన. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి కి కంచుకోట. ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీలో ప్రధాన కార్యదర్శిగానూ పనిచేసిన ఆయన.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ చేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఏడో సారి విజయం సాధించిన ఈయనకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని అంత అనుకున్నారు కానీ కూటమి పొత్తులో కుదరలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే అవకాశం దక్కింది.
Read Also : Kim – Putin : ఉత్తర కొరియాలో పుతిన్.. కిమ్‌తో భేటీ.. కీలక ఎజెండా !