Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం..
- By Sudheer Published Date - 10:03 PM, Sun - 10 March 24

విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై పెను ప్రమాదం (Big Risk) తప్పింది. మంటలను ఆర్పేందుకు కొండమీదకు వచ్చిన ఓ ఫైరింజన్.. తిరిగి వెళ్లే సమయంలో బ్రేక్ ఫెయిల్ కావటంతో ఎదురుగా వచ్చిన బస్సు మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఫైరింజన్ డ్రైవర్ వాహనాన్ని కొండవైపునకు తిప్పడం తో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. దీంతో భక్తులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అసలు ఏం జరిగిందంటే.. ఆదివారం ఉదయం కొండపై ఉన్న ఓ చెత్తకుప్పలో మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన భక్తులు ఫైరింజన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఫైరింజన్‌తో అక్కడకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే తిరిగి వెళ్లే సమయంలో ఫైరింజన్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావటంతో వాహనం అదుపుతప్పింది. ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో అందులోని భక్తులు హడలిపోయారు. అయితే ఫైరింజన్ డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ప్రమాదాన్ని తప్పించాడు. లేకపోతే పెను ప్రమాదం వాటిల్లేది.
Read Also : Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగలనుందా..? ఈ ఐపీఎల్‌లో కూడా కష్టమేనా..?