Elephants Attack: గజరాజుల భీభత్సం.. భయాందోళనలో చిత్తూరు ప్రజలు!
ఏపీపై అటవీ జంతువులు పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి.
- By Balu J Published Date - 12:34 PM, Mon - 20 June 22

ఏపీపై అటవీ జంతువులు పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్ టైగర్ ఒకటి కాకినాడ జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. తాజాగా ఏనుగుల గుంపు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. చిత్తూరు పలమనేరు పట్టణ పరిసర అటవీ ప్రాంతాలలో గుంపు గుంపులుగా వందల సంఖ్యలో చేరుకున్న ఏనుగులు. భయాందోళనలో పరిసర ప్రాంత ప్రజలు. భయంతో పరుగులు తీసి ఎత్తైన ప్రాంతాలు , కరెంటు టవర్ లు,సెల్ టవర్లు ఎక్కిన స్థానిక ప్రజలు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానిక ప్రజలు. హుటాహుటిన ఏనుగుల ఉన్న స్థానానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో కూడా చిత్తూరు జిల్లాపై ఏనుగుల మంద దాడులు చేసిన సంగతి తెలిసిందే. తరచుగా జన సంచారంలోకి వస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. అక్కడితో ఆగిపోకుండా రైతులకు సంబంధించిన విలువైన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటను నష్టపరుస్తూ కోలుకోలేని దెబ్బను తీస్తున్నాయి. స్థానికులు ఏమాత్రం ప్రతిఘటించిన ఘీంకారాలు చేస్తూ దాడులకు దిగుతున్నాయి. అటవీ శాఖాధికారులు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన స్థానికులు కోరుతున్నారు.