EC : ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు
అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది
- By Sudheer Published Date - 12:42 PM, Sun - 5 May 24

ఎన్నికలు (Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఇస్తుంది ఎన్నికల సంఘం. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు (Transfer) వేస్తూ వస్తుంది. ఇప్పటికే పలువు శాఖల్లోని కీలక అధికారులపై బదిలీ వేటు చేసిన ఈసీ..మరో ఇద్దరిపై బదిలీ వేటు వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి (Veera Raghava Reddy).. అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా(Mahbub Basha)ను ఈసీ బదిలీ చేసింది. అనంతపురం డీఎస్పీ రాఘవరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బదిలీ చేసింది. వెంటనే తమ కింది అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం వారిని ఆదేశించింది. ఈసీ ఆదేశాలో డీజీపీ ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇద్దరు డీఎస్పీలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
అనంతపురం టీవీ టవర్ సమీపంలో వ్యక్తిగత కారణాలతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు గొవడకు దిగితే.. డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును అరెస్ట్ చేశారని పార్టీ నేతలు ఆరోపించారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని లేదా సస్పెండ్ చేయాలని కోరారు. విచారణ అనంతరం ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది.
Read Also : Heavy Heat Waves in Telangana : నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది మృతి