CBN : మాకేమైనా సొంత ఛానల్, పేపర్ ఉందా? – చంద్రబాబు సూటి ప్రశ్న
CBN : రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, తమ కూటమిపై నిరాధారమైన ఆరోపణలు చేయడానికి మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు
- By Sudheer Published Date - 08:47 PM, Sat - 23 August 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) వై.ఎస్.ఆర్.సి.పి. అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. విష ప్రచారాలు చేయడానికి తమకు సొంత ఛానెళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. “టీడీపీకి ఛానల్ ఉందా? పవన్ కళ్యాణ్‌కు, బీజేపీకి ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఛానల్ ఉందొ తెలియదా” అని ప్రశ్నించారు. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను ప్రసారం చేయడానికి జగన్ ఒక పేపర్, ఒక టీవీ ఛానల్‌ను పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
India Exports To China: భారత్- చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్కలు ఇదిగో!
సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అసభ్యకర పోస్టుల గురించి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.
జగన్ మోహన్ రెడ్డి తన సొంత మీడియాను ఉపయోగించుకుని తమ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, తమ కూటమిపై నిరాధారమైన ఆరోపణలు చేయడానికి మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను గుర్తించాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ కూటమి నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.