Chandrababu : రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన
- Author : Sudheer
Date : 01-03-2024 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు నెల్లూరు ( Nellore ) లో పర్యటించబోతున్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధినేతలు సైతం వరుస పెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. సింగిల్ గా బరిలోకి దిగితే కుదరదని , జనసేన తో పొత్తు పెట్టుకుంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు టికెట్ల పంపకం జరిపారు. తాజాగా ఉమ్మడి భారీ సభ సైతం నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు ఇరు పార్టీల అధినేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయాలనీ చూస్తున్నారు. ఇందులో భాగంగా రేపు చంద్రబాబు (Chandrababu ) నెల్లూరులో పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగే భారీ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపు చంద్రబాబు సమక్షంలో ఎంపీ వీపీఆర్ దంపతులు టీడీపీలో చేరనున్నారు. వారితో పాటు వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పసుపు జెండా కప్పుకోనున్నారు. అలాగే 4న రాప్తాడు చంద్రబాబు పర్యటిస్తారు. ‘‘రాకదలి రా’’ సభలో పాల్గొంటారు. ఇప్పటికే 22 రా కదలి రా సభల్లో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతి పార్లమెంట్‌లో ఒక రా కదలి రా సభను చంద్రబాబు నిర్వహిస్తూ వస్తున్నారు.
Read Also : Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది