Chandrababu : చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలంటూ కోర్ట్ లో పిటిషన్
3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని వివరించారు
- By Sudheer Published Date - 02:59 PM, Thu - 26 October 23

స్కిల్ డెవలప్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు (Chandrababu ) కంటికి ఆపరేషన్ (Chandrababu’s Eye problem) చేయాలనీ..ఇందుకు గాను ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరుపు లాయర్లు ఏపీ హైకోర్టు (AP High Court) లో పిటిషన్ దాఖలు చేసారు. స్కిల్ డెవలప్ కేసులో బాబు ను అరెస్ట్ చేసిన దగ్గరి నుండి కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆయన ఆరోగ్యం ఫై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆయన వయసు ను గమనించైనా ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో రోజులు గడుస్తున్నాయి తప్ప బెయిల్ (Chandrababu Bail) మాత్రం రావడం లేదు. ఇదిలా ఉంటె చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని వివరించారు. శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య సమస్యల్ని దాచి పెడుతోందని ఆరోపిస్తున్నారు. అంతకు ముందుకు కూడా చంద్రబాబుకు డెంగ్యూ దోమలు కుట్టించి చంపాలనుకుంటున్నారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఎక్కించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని, ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని, జైల్లో నక్సలైట్లు ఉన్నారని, డ్రోన్ లు తిరుగుతున్నాయని.. టీడీపీ నేతలు రకరకాలా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Read Also : Anchor Suma : మీడియాపై సుమ సెటైర్లు.. అనంతరం సారి చెప్పిన సుమ..