HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Srikakulam Speech

CBN : నేను బటన్ నొక్కే టైపు కాదు – చంద్రబాబు

CBN : మత్స్యకారుల పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించామని, మత్స్యకార పిల్లలు మంచి విద్య పొందేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని

  • Author : Sudheer Date : 26-04-2025 - 8:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Srikakulam
Cbn Srikakulam

శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల (Chandrababu Srikakulam Tour) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను కేవలం బటన్ నొక్కే నాయకుడు కాదని, ప్రజల మద్యకి వచ్చి వారి కష్టాలను నేరుగా తెలుసుకుంటున్నానని స్పష్టం చేశారు. గత పాలకులు ప్రజల సమస్యలను చూసేందుకు చెట్లు నరికేసి, పరదాల వెనక కార్యకలాపాలు నిర్వహించేవారని విమర్శించారు. తాను మాత్రం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని పెంచే విధంగా పని చేయాలని, ప్రజల జీవితం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నాయుడు తెలిపారు.

మత్స్యకారుల అభివృద్ధికి పలు పథకాలు

మత్స్యకార కుటుంబాలకు మద్దతుగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని చంద్రబాబు నాయుడు వివరించారు. వేట విరామ సమయంలో జాలర్లకు రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు 1,29,178 కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని, ఏడాదిలోగా ఈ హార్బర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మత్స్య సంపదలో ఏపీ వాటా 29 శాతం ఉందని గర్వంగా పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

విద్య, ఉపాధికి ప్రత్యేక ప్రాధాన్యత

మత్స్యకారుల పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించామని, మత్స్యకార పిల్లలు మంచి విద్య పొందేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఎచ్చెర్లలో ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రం కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ద్వారా ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Former Minister Harish Rao: తెలంగాణ అంటేనే బీఆర్ఎస్: మాజీ మంత్రి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • chandrababu srikakulam
  • tdp

Related News

Pemmasani Vs Ambati

Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య వైరం కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న పెమ్మసాని 'చంపేస్తాం' అనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై వైసీపీ నేతలు మండిపడుతుండగా

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

  • Unnam Hanumantharaya Chowdh

    Kalyandurgam : TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Latest News

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

  • H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd