HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Quash Petition Postpone

Chandrababu Quash Petition : అక్టోబర్ 03 కు వాయిదా వేసిన సుప్రీం కోర్ట్

నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ అయింది

  • Author : Sudheer Date : 27-09-2023 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbnsc
Cbnsc

చంద్రబాబు క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) ను ఏపీ హైకోర్టు (AP High court) తిరస్కరించడంతో..చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసారు. ఈ పిటిషన్ ఫై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా..నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేయాలని సీజేఐ వద్ద మెన్షన్ చేశారు.

పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలనేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబుకు మధ్యంతరం ఉపశమనం కలిగించాలనేది రెండో అభ్యర్థన అని లూథ్రా విన్నవించారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసిందని, మరో 15 రోజుల కస్టడీకి కోరుతున్నారని చెప్పారు. జెడ్ కేటగిరీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ఎలా ట్రీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు.

సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కల్పించుకున్నారు. అయినప్పటికీ లూథ్రా వాదనను సీజేఐ పూర్తిగా విన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో వరుస కేసులు వేస్తున్నారని చెప్పారు. తక్షణమే చంద్రబాబుకు ఉపశమనం కలిగించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సీజేఐ డీవై చంద్రచూడ్… కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో 3వ తేదీకి వాయిదా వేస్తున్నామని. వచ్చే మంగళవారం వాదనలు వింటామని తెలిపారు.

Read Also : 8th Continent : 375 సంవత్సరాల తర్వాత బయటపడిన 8వ ఖండం.. మ్యాప్ రెడీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Quash Petition
  • postpone
  • Supreme Court

Related News

Telangana Cm Revanth Reddy

CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

2016 నాటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు, రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ (Quash) తీర్పునిచ్చింది.

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd