Chandrababu : హిందూపురం రేపు రేఖలు మార్చబోతున్న బాలకృష్ణ
Chandrababu : రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి వంటి పలు కీలక రంగాలకు నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
- Author : Sudheer
Date : 26-04-2025 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూపురం (Hindupur Constituency) రూపురేఖలు మారబోతున్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) చొరవతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హిందూపురం అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేశారు. రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి వంటి పలు కీలక రంగాలకు నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీడీపీ సమన్వయకర్త శ్రీనివాసరావు, బాలయ్య వ్యక్తిగత సహాయకుడు వీరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించగా, వెంటనే స్పందించిన సీఎం నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు.
Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ..28 మంది మావోలు మృతి
హిందూపురంలో రహదారుల విస్తరణ కోసం రూ.92.50 కోట్లు, ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కోసం రూ.136 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా హిందూపురం-మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణకు రూ.1,124 కోట్ల భారీ నిధులు మంజూరు చేశారు. అలాగే పట్టణంలోని గుడ్డం కోనేరు అభివృద్ధికి కూడా అహుడా నిధుల నుంచి రూ.1.50 కోట్లను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నిధుల విడుదలతో హిందూపురం పట్టణానికి ఒక కొత్త ఒరవడి చేకూరే అవకాశం ఉంది.
నందమూరి బాలకృష్ణ ఒకవైపు హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తూనే, మరోవైపు తన సినీ కెరీర్‌కి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై పట్టుదలతో పని చేస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో హిందూపురం ప్రాంతపు మౌలిక సదుపాయాలు మెరుగుపడి, ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందే అవకాశం ఉంది. బాలయ్య నాయకత్వం, చంద్రబాబు మద్దతుతో హిందూపురం కొత్త రూపం దాల్చబోతోంది.