HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Launched The Tdp For Andhra Website And Appealed To People For Donations

AP TDP: ‘టీడీపీ ఫర్ ఆంధ్ర వెబ్‌సైట్’ ను ప్రారంభించిన చంద్రబాబు, విరాళాల కోసం ప్రజలకు విజ్ణప్తి

  • Author : Balu J Date : 09-04-2024 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP Karumuru Nageswara Rao sensational comments on Chandrababu Naidu
YCP Karumuru Nageswara Rao sensational comments on Chandrababu Naidu

AP TDP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టగా, టీడీపీ ప్రజాగళం పేరుతో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పార్టీకి విరాళలందించేందుకు గాను tdpforandhra.com సైట్ ను మంగళవారం ఆవిష్కరించారు.

విరాళాల కోసం ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు తన వంతుగా రూ.99,999లు ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ. ‘‘రాష్ట్రాన్ని జగన్ రివర్స్ గేర్ లో నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీ చరిత్ర కలిగిన పార్టీ అని, 42 ఏళ్లు అనుభవం ఉందన్నారు. రాజకీయాల్లోకి ధనవంతులు, భూస్వాములు కాకుండా..విద్యావంతులు రావాలి..నీతివంతులతో సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందుకు వెళ్లిందన్నారు. చదువుకున్న వారిని ఎమ్మెల్యే, ఎంపీలుగా చేశాం’’ అని అన్నారాయన.

‘‘పార్టీకి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బులను కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. వైసీపీలాగా అక్రమ సొమ్ముతీసుకోవడం లేదు. రూ.160 కోట్లకు వైసీపీ జూదగాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని విలువల గురించి మాట్లాడుతోంది. ఆన్ లైన్ జూదాన్ని అధికారికంగా ఒప్పుకున్నారు. అలాంటి నీచనమైన పనులు చేయడం దుర్మార్గం. మేము తెలుగు ప్రజలపైనే ఆధారపడుతున్నాం. అందరూ ముందుకు వచ్చి తోచిన విధంగా పార్టీకి సాయం అందించాలి’’ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

కాగా చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘వలంటీర్లూ.. తన రాజకీయ స్వార్థం కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్న వైఎస్ జగన్ మాయ మాటలను నమ్మకండి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వలంటీర్లుగా మిమ్మల్నే కొనసాగించడమే కాదు.. మీ గౌరవ వేతనాన్ని రూ. 10 వేలు చేస్తాం’ అని ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ప్రధాన పార్టీకి వ్యూహాలకు చెక్ పెడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • chandra babu
  • website

Related News

Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ సీనియర్లకు గౌరవం… కొత్తవారికి అవకాశాలు…సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చిన అధిష్టానం నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు…. ప్రతి కమిటీలోనూ నూతనత్వం 29

  • Nara Lokesh

    Chandrababu Naidu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్

Latest News

  • సీఎస్కేకు శుభ‌వార్త‌.. జ‌ట్టులోకి ధోనీ?

  • KCR : కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు బిగ్‌ రిలీఫ్‌.

  • Kedarnath : నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. తెరుచుకున్న ఆలయ ద్వారాలు..

  • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

  • ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

Trending News

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd