Tirumala : మరో రికార్డు సృష్టించిన చంద్రబాబు..
Tirumala : ఇప్పటివరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై.. స్వామివారికి పట్టు వస్త్రాలు అధిక సార్లు సమర్పించిన సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు
- Author : Sudheer
Date : 04-10-2024 - 8:24 IST
Published By : Hashtagu Telugu Desk
రాజకీయాల్లో రికార్డ్స్ సృష్టించాలన్నా..చంద్రబాబే (Chandrababu)..రికార్డ్స్ తిరగరాయాలన్న చంద్రబాబే అని మరోసారి టీడీపీ శ్రేణులు గౌరవంగా చెప్పుకుంటున్నారు. రాజకీయపరంగా ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తిరగరాసిన బాబు..తాజాగా మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పటివరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై.. స్వామివారికి పట్టు వస్త్రాలు (Srivari Pattu Vastralu) అధిక సార్లు సమర్పించిన సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల (Tirumala Brahmotsavam 2024) సమయంలో ప్రభుత్వం తరఫున.. సీఎం హోదాలో ఉన్న నేత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. నేడు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు.
ఇక అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. రాత్రి 9 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు మొదలవుతాయి. వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. నేటి నుంచి వాహనసేవాలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రధానం చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఏపీ సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
Read Also : Bengal’s Durga : నేరాలు చూడలేక కళ్లు మూసుకున్న దుర్గామాత ..ఎక్కడో తెలుసా..?