Chandrababu : ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
- By Sudheer Published Date - 05:33 PM, Mon - 29 January 24

సోమవారం రాజమండ్రి కాతేరు (Katheru)లో జరిగిన ‘రా.. కదలిరా’ (Ra Kadalira)సభలో చంద్రబాబు (Chandrababu )కు పెను ప్రమాదం తప్పింది. రాజానగరం టికెట్ను జనసేనకు కేటాయించడంతో బొడ్డు వెంకటరమణ వర్గీయులు చంద్రబాబు ఫై విరుచుకపడ్డారు. ఈ క్రమంలోనే బాబు స్టేజీ దిగుతుండగా వారంతా ఒక్కసారిగా నెట్టేశారు. దీంతో బాబు స్టేజీ పైనుంచి కిందపడబోయారు. వెంటనే సెక్యూరిటీ ఆయనను పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ వర్గ కార్యకర్తలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో టికెట్ల కేటాయింపు విషయంలో అన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత జగన్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో చాలామంది నేతలు అధిష్టానం ఫై వ్యతిరేకత చూపిస్తూ..పార్టీ నుండి బయటకు వస్తున్నారు. అలాగే ఈసారి టిడిపి – జనసేన కలిసి బరిలోకి దిగుతుండడంతో టికెట్స్ విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. తాజాగా మండపేట , అరకు స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగుతుండడం అక్కడి జనసేన నేతలు కాస్త ఆందోళన వ్యక్తం చేయగా..ఇక రాజానగరం , రాజోలు స్థానాల నుండి జనసేన బరిలోకి దిగుతుండడం తో ఇంతకాలం ఈ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నేతలు అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం వీరి ఆగ్రహాన్ని చంద్రబాబు కళ్లముందు ఉంచారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని కాతేరులో టీడీపీ ‘రా కదలిరా..’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. గోదావరి నాలుగో బ్రిడ్జి సమీపంలో తిరుమల విద్యాసంస్థల సమీపాన 23 ఎకరాల మల్లు లేఅవుట్‌లో నిర్వహిస్తున్న ఈ సభకు 7 నియోజకవర్గాల నుంచి ప్రజలు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో కాతేరు సభలో రాజానగరం టికెట్ను జనసేనకు ప్రకటించడంపై స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బొడ్డు వెంకట రమణ వర్గీయులు స్టేజిపై ఆందోళన చేశారు. అనంతరం స్టేజిపై చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చంద్రబాబుపై కార్యకర్తలు పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాబు నుకిందపడకుండా పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. టీడీపీ నేతల తీరుపై చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీలో తిరుగుబాటు మొదలైందని , వైసీపీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు అయిపోగానే ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. ‘వైసీపీ నేతలు మహిళలను నడిరోడ్డుపై వేధిస్తున్నారు. మహిళల జోలికి వస్తే వైసీపీకి అదే చివరి రోజు అవుతుంది’ అని చంద్రబాబు హెచ్చరించారు.
రాజమండ్రి సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం!
కాతేరులో టీడీపీ నిర్వహిస్తున్న 'రా.. కదలిరా' సభలో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు కోసం టీడీపీ నేతలు ఒక్కసారిగా స్టేజీ మీదకు రావడంతో కొద్దిగా తోపులాట చోటు చేసుకోవడంతో చంద్రబాబు స్టేజీ పైనుంచి కిందపడబోయారు.
వెంటనే సెక్యూరిటీ… pic.twitter.com/RtfbURtqFU
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2024
Read Also : Rajasthani Chicken Curry: ఎంతో స్పైసీగా ఉండే రాజస్థానీ చికెన్ కర్రీ.. ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండిలా?