CBN Is Back : గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడతా అన్నట్లే..అడుగుపెట్టాడు
'అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు.. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తా.. ఇది కౌరవ సభ.. గౌరవ సభ కాదు.. ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను.. ప్రజలందరూ నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా'
- Author : Sudheer
Date : 21-06-2024 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
2024 ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగానే అసెంబ్లీ (AP Assembly)లో అడుగుపెడతానని..2021 నవంబర్ 19.. ఏపీ అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) చేసిన శపథం ఎవ్వరు మరచిపోరు.. ‘అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు.. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తా.. ఇది కౌరవ సభ.. గౌరవ సభ కాదు.. ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను.. ప్రజలందరూ నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా’ అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు సీఎంగానే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేసిన సమయంలో ఎంతోమంది ఎగతాళి చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదంటూ హేళన చేశారు. వాటన్నింటిని టీడీపీ అధినేత పట్టించుకోలేదు. ప్రజలనే నమ్ముకుని.. ఏపీ అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బాబుపై విశ్వాసం ఉంచిన ప్రజలు భారీ మెజార్టీతో టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్లే ఈరోజు చంద్రబాబు అసెంబ్లీ లో అడుగుపెట్టారు. రెండున్నరేళ్ల తర్వాత సభకు CM హోదాలో తమ చీఫ్ ఎంట్రీ ఇవ్వడంతో TDP నేతలు భావోద్వేగానికి గురయ్యారు. ‘నా భార్యను అనరాని మాటలు అన్నారు. కౌరవసభలో ఉండను. గౌరవసభలోకే వస్తా’ అంటూ చంద్రబాబు గతంలో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సరిగ్గా 09 :46 గంటలకు అసెంబ్లీ సమావేశాలను ప్రారంభం అయ్యాయి.
*చంద్రబాబు గారి శపథం నెరవేరిన రోజు.. కౌరవ సభ నుండి గౌరవ సభకు..✌️*#NarachandraBabuNaidu pic.twitter.com/jH3YrjA56H
— BheemBoy💕🇮🇳 Eat millets Stay Healthy🙏 (@PITCHBOSS) June 4, 2024
Read Also : Yoga Day Celebrations: యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యోగా.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం..!