AP New Ministers : మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు
ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ ఏ ఏ శాఖలు కేటాయిస్తారో అనే ఉత్కంఠ కు తెరదించారు
- Author : Sudheer
Date : 14-06-2024 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి..బుధువారం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి (Kesarapalli ) ఐటీ పార్కు వద్ద ఏర్పాటు చేసిన సభ వేదిక ఫై ముందుగా సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ ఏ ఏ శాఖలు కేటాయిస్తారో అనే ఉత్కంఠ కు తెరదించారు.
We’re now on WhatsApp. Click to Join.
మంత్రుల శాఖల వివరాలు (Portfolios Allocated):
పవన్ కళ్యాణ్ – డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు
నారా లోకేష్ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు
అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ
నాదెండ్ల మనోహర్ : ఆహారం, పౌరసరఫరాల శాఖ
వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ
పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి
సత్యకుమార్ యాదవ్ : ఆరోగ్యశాఖ
నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ
మహ్మద్ ఫరూఖ్ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ : ఆర్థిక శాఖ
అనగాని సత్యప్రసాద్ : రెవెన్యూ శాఖ
కొలుసు పార్థసారథి: హౌసింగ్, I &PR శాఖలు
డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ
గొట్టిపాటి రవికుమార్ : విద్యుత్ శాఖ
కందుల దుర్గేష్ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు
బీసీ జనార్థన్ : రహదారులు, భవనాల శాఖలు
టీజీ భరత్: పరిశ్రమల శాఖ
ఎస్.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖలు కేటాయించారు.

Ncb Ministers
Read Also : Game Changer : పవన్ పొలిటికల్ కారు సీన్‌ని.. ‘గేమ్ ఛేంజర్’లో కాపీ కొట్టేస్తున్న చరణ్..