Chandrababu : ఎవ్వరు ఆ పని చేయొద్దు – చంద్రబాబు కీలక సూచన
ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కరించే పని చేయవద్దని, ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని , కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని సూచించారు
- By Sudheer Published Date - 03:24 PM, Sat - 13 July 24

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) పార్టీ నేతలకు , రాజకీయ పార్టీల శ్రేణులకు కీలక సూచన తెలియజేసారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కరించే పని చేయవద్దని, ప్రజలతో కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని , కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని సూచించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం అమరావతిలోని ఎన్టీఆర్‌భవన్ లో చంద్రబాబు మాట్లాడుతూ..నేటి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరైనా సరే తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలని.. కానీ రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితవు పలికారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని సీఎం కోరారు. అంతకుముందు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Read Also : Medigadda Project : అంచనా కంటే అగ్వకే ఇసుక లోడింగ్.. ‘మేడిగడ్డ’ టెండర్లలో ఆసక్తికర పరిణామం