MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఎఫ్‌ఐఆర్ నెంబర్ 430/24, డేట్: 5-9-2024 కింద ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు కేసు నమోదు చేశారు.koneti adimulam
- By Sudheer Published Date - 03:16 PM, Fri - 6 September 24

Case Registered Against TDP MLA Koneti Adimulam : సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం (MLA Koneti Adimulam)పై యావత్ తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. సమాజంలో ఓ గౌరవ స్థానంలో ఉండి..ఓ మహిళా పై లైంగిక దాడికి పాల్పడడం పై సభ్య సమాజం ఛీ కొడుతుంది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేయగా..తాజాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిమూలం (Koneti Adimulam)పై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన బీమాస్ పారడైజ్ హోటల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 430/24, డేట్: 5-9-2024 కింద ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేను ఏ తప్పు చేయలేదు.. రాజకీయంగా ఎదుర్కోలేకనే కుట్ర
మరోపక్క తన పై వస్తున్న ఆరోపణలను ఆదిమూలం ఖండించారు.‘ నేను ఏ తప్పు చేయలేదు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కుట్ర పన్నారు. ఎన్నికల్లో టికెట్ వచ్చినప్పటి నుంచే నాపై కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో టీడీపీ పేరు చెప్పుకునే వారితోపాటు వైసీపీలోని కొందరు పెద్దలు కూడా ఉన్నారు. మహిళా నాయకురాలిని వాడుకుని నాపై మచ్చ వేశారు. నాపై ఈర్ష్య, ద్వేషం, కోపంతో ఈ నింద వేశారు. చాలా భాద కలిగిస్తోంది. నాపై నింద వేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను.
ఆమెను వేధించి ఉంటే భగవంతుడే చూసు కుంటాడు. నాకు ఓటు వేసి ఆదరించిన సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు నేను జవాబుదారీని. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగరాదు. 50 ఏళ్లు రాజకీయం చేసిన వాడ్ని న్యాయం ధర్మమే గెలుస్తుందని నమ్ముతున్నానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.
Read Also : Bandi Sanjay : మళ్లీ పార్టీ బాధ్యతలు బండి సంజయ్‌కే..త్వరలో అధిష్టానం ప్రకటన..?