Madhavi Latha : మాధవీలతపై కేసు నమోదు
Madhavi Latha : టీడీపీ మహిళా నాయకురాలు, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తనను కించపరిచే విధంగా మాధవీలత వ్యాఖ్యలు చేశారంటూ
- By Sudheer Published Date - 02:03 PM, Tue - 25 February 25

సినీ నటి మాధవీలత (Madhavi Latha), తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మధ్య వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇటీవల మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జేసీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తన వ్యాఖ్యలు తప్పుగా ఉండవచ్చని అంగీకరించి, మాధవీలతను క్షమాపణ కోరారు. అయినప్పటికీ మాధవీలత తన పోరాటాన్ని కొనసాగిస్తూ జేసీపై కేసును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
VH Meets CBN : చంద్రబాబు తో వీహెచ్ భేటీ
ఈ క్రమంలో తాజాగా మాధవీలతపై కూడా కేసు నమోదైంది. టీడీపీ మహిళా నాయకురాలు, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తనను కించపరిచే విధంగా మాధవీలత వ్యాఖ్యలు చేశారంటూ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాధవీలతపై IPC సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాధవీలత, జేసీ వివాదం రాజకీయంగా సమాజంలో పెనుచర్చకు దారి తీసింది. ఒకరి మీద ఒకరు పరస్పర కేసులు నమోదు చేసుకోవడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ వర్గాలు, మాధవీలత మద్దతుదారులు తామెవరికి మద్దతు ఇవ్వాలో అనే విషయంలో గందరగోళంలో ఉన్నారు.