BRS : తెలంగాణ ఏర్పాటు నగ్నసత్యాలు!BRS చీఫ్ నోట ఇలా.!!
తెలంగాణ వాదాన్ని కేసీఆర్ (BRS) ఉపయోగించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ (KCR)
- By CS Rao Published Date - 05:25 PM, Thu - 16 March 23

తెలంగాణ వాదాన్ని కేసీఆర్ (BRS) అన్ని రకాలు గా ఉపయోగించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కేవలం కేసీఆర్ (KCR) కారణంగా ఏర్పడిందని నమ్మే వాళ్లు ఇప్పటీకీ చాలా మంది ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ ఏపీ ఇంచార్జి తోట చంద్రశేఖర్ మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీల కారణంగా మాత్రమే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందని చెబుతున్నారు. అంటే, కేసీఆర్ కారణంగా తెలంగాణ రాలేదని బీఆర్ఎస్ నిజాలను వెల్లడిస్తోంది.
కేసీఆర్ కారణంగా తెలంగాణ రాలేదని..(BRS)
తెలంగాణ గాంధీగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్(KCR) ను రెండు దశాబ్దాలుగా ఫోకస్ చేసింది. రెండుసార్లు కేసీఆర్ సీఎం కావడానికి కారణం కూడా సెంటిమెంటే. కానీ, ఆయన 2014 ఎన్నికల్లోనే ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పారు. ఉద్యమ పార్టీ కాదని అప్పుడే వెల్లడించారు. దళిత సీఎం హామీని పక్కనపడేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన 63 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకోగలిగారు. ఆ తరువాత బంగారు తెలంగాణ (ఇప్పుడు కేసీఆర్ చెప్పే బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మాలా..) నిర్మాను ప్రయోగించారు. రాజకీయ బిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీని కూల్చేశారు. ఆ పార్టీపై ఏపీ ముద్ర వేసి సెంటిమెంట్ ను రంగరిస్తూ బంగారు తెలంగాణ నిర్మా సూత్రాన్ని అనుసరించారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు.
Also Read : KCR: మహారాష్ట్రలో మరో సభకు ప్లాన్ చేస్తోన్న కేసీఆర్… ఈ సారి అక్కడే ఇక !
తెలంగాణ ఉద్యమకారులను వదిలేశారు. తొలిసారి సీఎం అయిన తరువాత చండీయాగాలు, సహస్ర చండీయాగాలు, రాజశ్యామల యాగాలు చేస్తూ భూ కుంభకోణం, డ్రగ్స్ తదితరాలను తెరమీదకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రజాగ్రహం పెరుగుతోన్న విషయాన్ని గమనించిన కేసీఆర్ ముందస్తుగా 2018లో ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి ఆంధ్రోళ్లు దోచుకుంటారు అంటూ సెంటిమెంట్ ను రాజేసి కేసీఆర్ (KCR) సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన ఆస్తులు, అంతస్తుల గురించి అందరికీ తెలిసిందే. అందుకే, తెలంగాణ రాష్ట్రం వాదాన్ని పక్కన పడేసి భారతీయ వాదాన్ని(BRS) అందుకున్నారు. విభజన వాదాన్ని వదిలేసి సమైక్య వాదం వినిపిస్తూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు ఆయన వెంట ఉండడం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రాన్ని సోనియాగాంధీ విభజించారని
ఉద్యమ సమయంలోనూ ఆయన (KCR) ఏనాడూ పార్లమెంట్ మెట్లు తొక్కలేదు. ఆయన వ్యవహరించిన తీరును ఉద్యమకారులు ఇప్పటికీ చెబుతుంటారు. కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు కూడా పార్లమెంట్లో లేరని ఆనాడు ఎంపీగా ఉన్న సహచర ఎంపీ విజయశాంతి చెబుతుంటారు. కేవలం ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ రాష్ట్రం రాలేదని అందరికీ తెలుసు. అయినప్పటికీ కేసీఆర్ ఉద్యమం కారణంగా తెలంగాణ వచ్చిందని రాజకీయంగా లబ్దిపొందారు. ఉమ్మడి రాష్ట్రాన్ని సోనియాగాంధీ విభజించారని ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు తెలుసు. అందుకు పార్లమెంట్ వేదికగా బీజేపీ సహకారం అందించిందని ఎవర్ని అడిగినా చెబుతారు. అందుకే, ఈ చిన్నమ్మను కూడా గుర్తించుకోండని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే, బీజేసీ సహకరించిందని
వాస్తవాలు ఇలా ఉండగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర తెచ్చిన కుటుంబంగా కేసీఆర్ (KCR) ఫ్యామిలీ పొందిన లబ్ది ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. టీఆర్ఎస్ పార్టీని పెట్టిన 2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం ఆస్తులను లెక్కించాలని ఉద్యమకారులు తరచూ డిమాండ్ చేస్తున్నారు. కానీ, అధికారంలో పాతుకుపోయిన, లాబీయింగ్ లో రాటుతేలిన కేసీఆర్ ను ఇప్పుడు ఏ ఉద్యమకారుడు డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ, నిజాలను మాత్రం ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటపెట్టడం ఆహ్వానించదగ్గ అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే, బీజేసీ సహకరించిందని ఏపీ (BRS) చీఫ్ తోట చంద్రశేఖర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read : BRS Kavitha :ఆర్థిక పాపం పండింది!ED బేడీల వేళ నారీభేరీ!

Related News

Rahul Disqualified : విపక్షాలు ఏకం! కాంగ్రెస్ తో TMC, BRS!!
రాహుల్ పై (Rahul Disqualified)అనర్హత వేటు విపక్షాలను ఏకం చేస్తోంది.