Tirumala Laddu Issue : శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదు.. బాబు నాలుకను – భూమన
Tirumala Laddu Issue : నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి ఆయన తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో మునిగి..శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు.
- By Sudheer Published Date - 06:53 PM, Mon - 23 September 24

తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Issue) రోజు రోజుకు మరింత ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తమగు మాట్లాడుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఏ తప్పు జరగలేదని ప్రమాణాలు చేస్తున్నారు. చంద్రబాబు (Chandrababu) కావాలంటే ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తిరుమలను సందర్శించారు. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి ఆయన తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో మునిగి..శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదని, చంద్రబాబు నాలుకనని ఎద్దేవా చేశారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, అది చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ”నేను, సుబ్బారెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు. అలా చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం. ఆరోపణలను అంగీకరించం. తప్పు చేయలేదు, చేయం. లడ్డూ కల్తీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రభుత్వం కనుసన్నల్లో ఉండే సిట్, సీబీఐతో వద్దు. సీఎం చంద్రబాబు(Chandrababu) చెప్పినట్లే టీటీడీ ఈవో శ్యామలారావు(TTD Eo Shyamala Rao) వ్యవహరిస్తున్నారు” అని భూమన ఆరోపించారు. మరోపక్క లడ్డు వివాదం ఫై కేంద్రం సీరియస్ అయ్యింది. తిరుమలకు నెయ్యి (Ghee) సరఫరా చేసిన రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐతో పాటు తమిళనాడు చెందిన ఏఆర్ డెయిరీని ఆదేశించింది.
Read Also : Rythu Bharosa : తాజా మార్గదర్శకాలు లేకపోవడంతో రైతు భరోసాపై అనిశ్చితి