AP Results : ఎల్లుండి పవన్ తో చంద్రబాబు భేటీ..
ఈరోజు హైదరాబాద్ కు చేరుకొన్నారు. ఇన్ని రోజులు రిస్ట్ తీసుకున్న బాబు..ఇప్పుడు రాజకీయ సమావేశాలతో బిజీ అయ్యారు
- By Sudheer Published Date - 05:31 PM, Wed - 29 May 24

అమెరికా టూర్ ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఎల్లుండి (మే 31) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. జూన్ 04 న ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈసారి విజయం ఎవర్ని వరిస్తుందో అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈసారి టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీలో పోలింగ్ శాతం పెరగడం తో ప్రజలు మార్పు కోరుకున్నారని..కూటమికి భారీ విజయం అందించబోతున్నారని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. అంతే కాకుండా పలు సర్వేలు సైతం కూటమి విజయం ఖాయమని చెపుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో పోలింగ్ అనంతరం అమెరికా కు వెళ్లిన చంద్రబాబు..ఈరోజు హైదరాబాద్ కు చేరుకొన్నారు. ఇన్ని రోజులు రిస్ట్ తీసుకున్న బాబు..ఇప్పుడు రాజకీయ సమావేశాలతో బిజీ అయ్యారు. అమెరికా నుంచి రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు.. పలు కీలక అంశాలపై టీడీపీ నేతలకు సూచనలు చేశారు. అలాగే కౌంటింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మే 31న పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో అలాగే పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు.
పవన్ – బాబు లు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం . బీజేపీ నేతలు కూడా అదే రోజు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇక జూన్ 01 న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ పార్టీ శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
Read Also : Tragic Incident : బాపట్లలో సరదా ఈత..ప్రాణాలు పోయేలా చేసింది