Allagadda Attack: భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిన్న రాత్రి జరిగిన దారుణ ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ గాయపడ్డాడు. నిఖిల్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 04:15 PM, Wed - 15 May 24

Allagadda Attack: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఈ అల్లర్లలో పాల్గొంటుండగా ఈ ఘర్షణలో సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిన్న రాత్రి జరిగిన దారుణ ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ గాయపడ్డాడు. నిఖిల్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
బుధవారం తెల్లవారుజామున భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి అఖిల ఇంటి దగ్గర నిఖిల్ ఎవరితోనో నిలబడి ఉండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నిఖిల్ ఎగిరి కొంతదూరంలో కిందపడిపోయాడు. కారు అతని దగ్గర ఆగగా ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చి అప్పటికే గాయపడిన నిఖిల్‌పై ఆయుధాలతో దాడి చేయడం ప్రారంభించారు. గాయాలు ఉన్నప్పటికీ, నిఖిల్ తప్పించుకుని అఖిల ప్రియ ఇంట్లోకి వెళ్ళాడు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను వెంటనే నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. నిందితులను ఇంకా గుర్తించలేదు.
ఆళ్లగడ్డలో నిన్న అర్థరాత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం.
హత్యాయత్నానికి పాల్పడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/bnMlv1d8PN
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2024
నిఖిల్‌పై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మద్దతుదారులే దాడి చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. నారా లోకేష్ యువ గళం పాద యాత్రలో సుబ్బారెడ్డిపై నిఖిల్ విరుచుకుపడ్డాడు. అందుకే నిఖిల్‌పై సుబ్బారెడ్డి సన్నిహితులు దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య సుబ్బారెడ్డి, అఖిల ప్రియ నివాసాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: GT Force: 110కిమీ పరిధితో 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. ధర కూడా తక్కువే..!