HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Atmakuru By Election Raising Ycp

By Election : ఆత్మకూరులో వైసీపీకి టెన్షన్…అన్నీ ఉన్నా…భయమెందుకో…!!!

ఆత్మకూరు ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ చర్చకు తెర తీసింది. దీనికి అధికార వైసీపీ తెచ్చిపెట్టుకున్న తలనొప్పే కారణమని అధికార వర్గాలకు చెందిన నేతలే అంటున్నారు.

  • Author : hashtagu Date : 21-06-2022 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP Special status
Jagan Ycp Flag

ఆత్మకూరు ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ చర్చకు తెర తీసింది. దీనికి అధికార వైసీపీ తెచ్చిపెట్టుకున్న తలనొప్పే కారణమని అధికార వర్గాలకు చెందిన నేతలే అంటున్నారు. దివంగత శాసన సభ్యుడు మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మృతితో ఈ నియోజక వర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. నిజానికి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు మేకపాటి గౌతం రెడ్డి పై ఉన్న గౌరవంతో ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో ఈ ఎన్నిక లేకుండానే యూనానిమస్ గా ఆయన సోదరుడు మేకపాటి విక్రం రెడ్డి ఎమ్మెల్యే అవుతాడని అంతా అంచనా వేశారు. కానీ బీజేపీ గతంలో బద్వేల్ ఉపఎన్నిక తరహాలోనే పోటీలోకి దిగింది. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. బీజేపీ జాతీయ స్థాయిలోనే దేశంలో ఏ ఎన్నిక జరిగినా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ తరపున భరత్ కుమార్ యాదవ్ బరిలోకి దిగాడు.

ఇదిలా ఉంటే నిజానికి ఈ ఎన్నికలో అధికార వైసీపీ గెలుపు లాంఛనమే, ఆత్మకూరు వైసీపీకి పెట్టని కోట, అంతేకాదు ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు కూడా పోటీలో లేవు. ఇక బీజేపీకి ఆ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 2312 ఓట్లు మాత్రమే దక్కాయి. నోటా కన్నా 100 ఓట్లు ఎక్కువ సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఈ ఎన్నికల్లో అద్భుతాలు చేస్తుందని ఆశించడం కలే అవుతుంది.

అయినప్పటికీ, ఆత్మకూరు ఎన్నిక అధికార వైసీపీకి చిక్కులు ఎందుకు తెచ్చిపెడుతుందా అనే డౌట్ రావొచ్చు. దానికి కారణం ఆత్మకూరులో వైసీపీ పెట్టుకున్న టార్గెట్ లక్ష ఓట్ల మెజారిటీ, ఇదే వాళ్లను కలవరపెడుతోంది. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని సవాలు విసరవచ్చు. భారీ తనం అంటే ఏ సంఖ్య అయిన కావొచ్చు. కానీ వైసీపీ కచ్చితంగా లక్ష మెజారిటీ అని కుండ బద్దలు కొట్టింది ఇక్కడే లెక్కలు తేడా వస్తాయేమో అని కలవరం పట్టుకుంది.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతం రెడ్డికి 92758 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి, బొల్లినేని కృష్ణయ్యకు 70482 ఓట్లు పోల్ అయ్యాయి. టీడీపీపై వైసీపీ 22276 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే ఈ సారి టీడీపీ బరిలో లేదు. దీంతో వైసీపీ నేతలు అత్యుత్సాహంతో లక్ష మెజారిటీ సాధిస్తాం అని ప్రకటన చేసేశారు. అయితే అంతర్లీనంగా వైసీపీ నేతల్లో లక్ష మెజారిటీ రాకపోతే ఎలా అనే ప్రశ్న వేధిస్తోంది.

దీనికి కారణాలు లేకపోలేదు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,08,990 ఓటర్లు ఉంటే గత ఎన్నికల్లో సుమారు 75 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి పడ్డ ఓట్లు 92758 అంటే లక్ష క్రాస్ చేయలేదు. అయితే గతంలో టీడీపీకి పడ్డ ఓట్లు, వైసీపీకి ట్రాన్స్ ఫర్ అవుతాయా అనేది సస్పెన్స్ గా మారింది. దీంతో పాటు సాధారణంగా ఈ తరహా ఉప ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు జనం అంత ఆసక్తి చూపరు. చాలా మంది ఓటింగుకు దూరంగా ఉన్నా ఆశ్చర్యపడనవసరం లేదు.

అందుకే టీడీపీ ఓట్లు సైతం వైసీపీకి పడితేనే లక్ష మెజారిటీ సాధ్యం అవుతుంది. అందుకే ఈ సారి టీడీపీ బరిలో లేనప్పటికీ, ఆ ఓట్లను తమకు పడేలా, వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏకంగా చంద్రబాబుకు అభినందనలు తెలపడం వెనుక, ఈ వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీజేపీకి గెలుపుపై ఆశలు లేకపోయినప్పటికీ, టీడీపీ ఓట్లు తమకు ట్రాన్స్ ఫర్ అయితే, గౌరవప్రదంగా బయటపడతామనే ఆశతో ఉంది. మరి ఈ ఉప ఎన్నికకు ఏకంగా మంత్రులు, వివిధ ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తుండటంతో వైసీపీలో రిజల్ట్ పై ఎక్కడో తేడా కొడుతుందనే సంకేతాల్లో రాజకీయ వర్గాలకు అందుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Athmakuru
  • byelection
  • ycp

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటుంది, కాబట్టి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు

    Latest News

    • నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

    • మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది

    • వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో.. మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్ల..

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd