HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Application Deadline Extension For Liquor Shops In Ap

AP Liquor Tender : ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విఙప్తులు వచ్చాయి. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు

  • Author : Sudheer Date : 09-10-2024 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Liquor Tender 2024
Ap Liquor Tender 2024

మద్యం టెండర్ (Liquor Tender) దరకాస్తు దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తీపి కబురు తెలిపింది. మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ప్రకటన చేసింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తులు 11వ తేదీన సాయంత్రం 5గంటలకు ముగియగ, 14వ తేదీన డ్రా తీయనున్నట్లు.. 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విఙప్తులు వచ్చాయి. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేయనున్న 123 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఈ నెల 11వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు. మచిలీపట్నంలోని నోబుల్‌ కళాశాల ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. ఇందు కోసం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు బ్యాంకు కౌంటర్లలో నిర్దేశించిన నగదును చెల్లిస్తే వెంటనే 15 రోజులకు సరిపడా లైసెన్సును మంజూరు చేస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.

Read Also : Singer Sunitha : సింగర్ సునీత కాపురంలో చిచ్చుపెట్టిన యూట్యూబర్ ..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap liquor policy
  • AP Liquor Shops
  • ap liquor tender
  • ap liquor tenders last date
  • chandrababu
  • liquor

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd