Siddham VS Mimu Siddham : ఏపీలో పోటాపోటీగా సిద్ధం..మీము సిద్ధం హోర్డింగ్స్
- By Sudheer Published Date - 11:25 AM, Tue - 30 January 24
 
                        ఏపీలో రాజకీయాలు(AP Politics) కాకరేపుతున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రజల్లో వ్యతిరేకత గమనించిన జగన్..దానిని సరిదిద్దే పనిలో పడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను పక్కకు పెట్టి వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు.
ఇదే క్రమంలో ప్రజల్లోకి సిద్ధం పేరిట ప్రచారం (Jagan to begin Election campaign) మొదలుపెట్టారు. వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే జగన్ సిద్ధం అంటే…ప్రతిపక్ష పార్టీలు ఇంటికి పంపిచేందుకు మీము సిద్ధం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసిన సిద్ధం హోర్డింగ్స్ పెట్టిన ప్రతిచోటా పక్కనే మీము సిద్ధం అంటూ జనసేన హోర్డింగ్ పెడుతూ వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానం తో సరిపెట్టుకున్న పవన్..ఆ తర్వాత ఆ ఒక్క స్థానం కూడా వైసీపీ లో కలిసిపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ ఎత్తున గెలిచి తీరాలని జనసేనాధినేత పట్టుదలతో ఉన్నారు. సినిమాలు చేస్తూనే మరోపక్క పూర్తిగా రాజకీయాల్లో ఉన్నారు. గత మూడు నెలలుగా సినిమాల షూటింగ్ లు చేయడమే మానేశారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి కార్యకర్తల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం పొత్తుతోనే బరిలోకి దిగుతున్నాడు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక వచ్చే నెలలో పవన్ కూడా రంగంలోకి దిగబోతున్నాడు. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు విజయం సాదిస్తారనేది ఆసక్తి గా మారింది.
Read Also : ABVP Student Issue : ఏబీవీపీ ఝాన్సీ ఘటనలో..మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన సీపీ