White Paper on Power Department : మరో శ్వేత పత్రాన్ని విడుదల చేయబోతున్న చంద్రబాబు..ఈసారి దేనిమీద అంటే..!!
గడిచిన ఐదేళ్లలో వైసీపీ చేసిన అక్రమాలు , దోచుకున్న సొమ్ము , కబ్జా చేసిన భూములు ఇలా అన్నింటిని ప్రజల ముందు ఉంచుతున్నారు
- By Sudheer Published Date - 10:51 AM, Tue - 9 July 24

ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి తనదైన మార్క్ పాలన తో చంద్రబాబు (Chandrababu) దూసుకెళ్తున్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ (YCP) చేసిన అక్రమాలు , దోచుకున్న సొమ్ము , కబ్జా చేసిన భూములు ఇలా అన్నింటిని ప్రజల ముందు ఉంచుతున్నారు. అలాగే కీలక వాటిపై శ్వేత పత్రాలను (AP Govt. to Release White Papers) విడుదల చేస్తూ..ఆయా వాటికీ వచ్చిన నిధులు ..జగన్ చేసిన ఖర్చు..జేబులు నింపున్న నిధులు ఇలా అన్నింటిని వివరిస్తున్నారు. ఇప్పటికే పోలవరం , అమరావతి లపై శ్వేత పత్రాలను రిలీజ్ చేసిన బాబు..ఈరోజు ఇంధన శాఖ (Power Department)పై శ్వేత పత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంధన శాఖపై రేపు వాస్తవ పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం ఇంధన శాఖ ను నిర్వీర్యం చేసిన తీరు విస్తరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను విస్తరించనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది? అప్పట్లో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది? వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. తొలి టూర్ ఇదే..!