AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్- పూర్తి వివరాలు
AP Budget 2025-26 : కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా 'సూపర్ 6' పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం
- Author : Sudheer
Date : 28-02-2025 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Budget 2025-26 ) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ‘సూపర్ 6’ పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో దాదాపు 3.24 లక్షల కోట్ల రూపాయల ఖర్చు ప్రతిపాదించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Chandrababu New Concept : ఉగాది నుంచే అమలు
ఎన్నికల సందర్భంగా ‘సూపర్ సిక్స్’ హామీలతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం, వాటి అమలుకు గణనీయమైన నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. బడ్జెట్ రూపకల్పనలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా సముచిత స్థానం కల్పించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
Heat Wave Alert: అలర్ట్.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు!
ఈసారి బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభ్యులకు పుస్తకాలు ముద్రించకుండా పెన్‌డ్రైవ్‌లో బడ్జెట్ వివరాలు అందజేయనున్నారు. మీడియాకు కూడా డిజిటల్ పద్ధతిలో సమాచారాన్ని అందించనున్నారు. కేవలం ఆర్థిక మంత్రి చదివే ప్రతులు మాత్రమే ముద్రించి అందజేస్తారు. ఇది పాలనా పరంగా డిజిటల్ మార్పులకు అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.