Sayaji Shinde: పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన సినీ నటుడు షాయాజీ షిండే
- By Kode Mohan Sai Published Date - 11:02 AM, Wed - 9 October 24

ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు షాయాజీ షిండే(Sayaji Shinde) సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే(Sayaji Shinde) వ్యాఖ్యానించారు. ఇటీవల తన ఆలోచనను పవన్ కళ్యాణ్ తో పంచుకుంటూనే ఒక టీవీ(Bigg Boss) కార్యక్రమంలో చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే(Sayaji Shinde) పవన్ కళ్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. వీరి సమావేశానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ కార్యాలయం ఎక్స్(ట్విట్టర్) వేదికగా విడుదల చేసింది. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వాలంటూ నటుడు షాయాజీ షిండే(Sayaji Shinde) చేసిన సూచనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి స్వాగతిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయిన ప్రముఖ నటులు శ్రీ షాయాజీ షిండే గారు.
ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని శ్రీ షాయాజీ షిండే గారు ఇటీవల తెలిపి… శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి… pic.twitter.com/858gZWucNA— JanaSena Party (@JanaSenaParty) October 8, 2024
Deputy CM, JanaSena Chief Sri Pawan Kalyan garu has expressed his support for Sri Sayaji Shinde's proposal to offer a plant along with Prasadam in Temples. Within two days @PawanKalyan garu met with Sri Sayaji Shinde to discuss the idea.#PawanKalyanAneNenu pic.twitter.com/r8U0Ne50iY
— JanaSena Party (@JanaSenaParty) October 8, 2024
రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభించే పల్లె పండగ వారోత్సవాలలో రూ. 4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా ఈ పండగ వారోత్సవాల నిర్వహణకు కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పనులకు రూ. 2,239 కోట్ల విలువైన 26,715 పనులకు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. మిగిలిన పనులకు కూడా త్వరగా అనుమతులివ్వాలని ఆదేశించారు. గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది రూ. 4,500 కోట్ల పనులకు పంచాయతీలు తీర్మానాలు చేశాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కలెక్టర్లు ఆమోదించిన పనులు వారోత్సవాల్లో ప్రారంభించాలని ఆదేశించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ర్టంలోని పంచాయతీల్లో నిర్వహించే 'పల్లె పండుగ' కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్లు, జిల్లా… pic.twitter.com/fLB10O3Jkw
— JanaSena Party (@JanaSenaParty) October 8, 2024
ఈ పనుల నిర్వహణలో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు భూమిపూజ చేయాలని నిర్ణయించారన్నారు డిప్యూటీ సీఎం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ఆహ్వానించి, పనులకు శంకుస్థాపనలపై రోజువారీ రూట్ మ్యాప్‌లు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రతి గ్రామ సచివాలయం, ఉపాధి హామీ, మరియు ఇతర అనుబంధ ప్రభుత్వ శాఖల సిబ్బంది హాజరయ్యేందుకు చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాల్లో ప్రారంభించిన పనులతో పాటు ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు సంక్రాంతి సమయానికి పూర్తి చేయాలని చెప్పారు. ఈ పనుల వివరాలను ప్రజలకు చేరవేయాలంటే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల్లో పండ్ల తోటలు, పంట కుంటలు, గోకులాలు వంటి ఆస్తుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి సమస్యలను నివారించాలన్నారు. ఈ ఏడాది మే 20 నుండి కూలీలకు రావాల్సిన రూ.2,081 కోట్ల వేతనాల బకాయిలు చెల్లించామన్నారు. తాజాగా, అందరి సహకారంతో ఆగస్టు 23న 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో పల్లె పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు.