Snake Women : నాగుపాముతో కలిసి జీవిస్తున్న మహిళ.. తన భర్తే ఆ రూపంలో వచ్చాడని?
- By Nakshatra Published Date - 02:10 PM, Wed - 8 June 22
మామూలుగానే పామును చూస్తే భయంతో పరుగులు పెడతాము. అలా కాకుండా పాము మన పక్క నుంచి వెళ్ళిన దగ్గర నుంచి చూసిన అప్పుడు వారి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక మహిళ మాత్రం చనిపోయిన తన భర్త మళ్లీ పాము రూపంలో తిరిగి వచ్చాడు అని దాని ఆలనాపాలనా చూసుకుంటుంది. అంతేకాకుండా ఆ పాముని బెడ్ మీద పెట్టుకుని మరీ చూసుకుంటోంది. అయితే ఈ కర్ణాటక లోని కులహల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని బాగల్కొటె జిల్లా బన హట్టి తాలూకా కులహల్లి గ్రామంలో శారవ్వ కంబార ఒక మహిళ నివసిస్తోంది. అయితే ఆమె భర్త రెండేళ్ల క్రితమే చనిపోవడంతో అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. అయితే ఇటీవల ఒక నాలుగు రోజుల క్రితం ఒక పాము ఇంట్లోకి చొరబడింది. చనిపోయిన తన భర్త పాము రూపంలో వచ్చాడు అనుకున్న ఆమె ఆ విషయం బయటి వాళ్లకు ఎవరికీ చెప్పకుండా గత కొద్ది రోజులుగా పెంచుకుంటోంది.
అంతే కాకుండా దాని ఆలనాపాలనా చూసుకుంటూ దానితో ముచ్చట్లు కూడా చెబుతోందట. అయితే ఒకరోజు ఆమె ఇంటికి పక్కింటి మహిళల రాగా నల్ల తాచు పాముని చూసి షాక్ అయ్యింది. దీనితో ఆ విషయం కాస్త చుట్టుపక్కల వారికి తెలియడంతో ఆ పాము ని చూడడానికి అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ఇరుగుపొరుగువారు వచ్చి ఆ పాము గురించి ఆరా తీయగా ఆ పాము తన దగ్గర నాలుగు రోజులనుంచి ఉంటుందని, ఎవరినీ ఏమీ చేయదని చంపొద్దు అంటూ వారిని వేడుకుంది.
సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ పాముని బంధించి అడవిలో వదిలి పెట్టారు. అయితే ఆ మహిళ అదృష్టం ఏంటంటే ఆ పాము ఆమె వద్ద ఉంటున్న కూడా ఆమెపై దాడి చేయలేదు. ఆమెకు ఎటువంటి హాని కలిగించలేదు. అయితే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు ఇలాంటి పిచ్చి పనులు చేయద్దని ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని అని హెచ్చరించారు.
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.