CM Jagan New Look: లేటెస్ట్ పిక్.. సూటు, బూటులో సీఎం జగన్!
నిత్యం వైట్ అండ్ వైట్ దుస్తుల్లో కనిపించే వైఎస్ జగన్ (CM Jagan) సూటు, బూటులో కనిపించింది అందర్నీ ఆకట్టుకున్నాడు.
- By Balu J Published Date - 04:02 PM, Thu - 22 December 22
ఫొటోషూట్స్ (Photoshoot).. అనగానే హీరో హీరోయిన్స్, మోడల్స్ మాత్రమే గుర్తుకువస్తుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. తమపై ఫోకస్ ఉండేలా ఫోటోషూట్స్ చేస్తుంటారు. అందుకే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఫొటోలకు ఫోజులిస్తుంటారు. కానీ రాజకీయ నాయకులు ఫోటోషూట్స్ చేయడం మాత్రం అరుదు అని చెప్పుకోవాలి. కానీ ఏపీ సీఎం జగన్ రెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. AP CM YS జగన్మోహన్ రెడ్డి సూట్, బ్లేజర్ ధరించి ఉన్న ఫోటోషూట్ వైరల్ (Viral Pic) అవుతోంది.
ఈ రిచ్ షూట్లో జగన్ (CM Jagan) చాలా అందంగా కనిపించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను ఇప్పట్నుంచే ప్రారంభించాయి. YSRCPకి మాస్ ఇమేజ్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉంది. అయితే విద్యావంతులైన ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ టీడీపీ, జనసేన కంటే వెనుకబడి ఉంది.
బహుశా, విద్యావంతుల ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి, జగన్ & కో తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోటోషూట్స్ చేసి ఉండవచ్చునని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఈ ఫోటోషూట్ విద్యావంతులను ఆకర్షిస్తుందా? లేదా అని వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ కావడంతో ’జగనన్న హీరో‘ (CM Jagan) అని కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ నేతలు.
Also Read: Air Hostess Video: ఐ యామ్ నాట్ యువర్ సర్వెంట్.. ఎయిర్ హోస్టెస్ వీడియో వైరల్!
Related News
Roja: జగన్ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటారు: రోజా
Roja: గెలుపు వైఎస్సార్సీపీదే అని మంత్రి ఆర్కేరోజా ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాదిరి గ్రామంలో పర్యటించారు. ఆమెకు స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి చేసేవారికే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లిన ఆమె ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ సాక్షాధారాలకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజ�