Today Horoscope : సెప్టెంబరు 11 సోమవారం రాశిఫలాలు.. వారు లావాదేవీల్లో జాగ్రత్త పడ్డాలి

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 08:27 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి  వారికి  కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది.  బిజీగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పెద్దల సలహాలు పాటించడం మంచిది. వ్యాపారంలో లాభం ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ప్రవర్తన వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో అనవసర వాగ్వాదాలకు దిగకూడదు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారిపై వ్యాపారానికి సంబంధించిన ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వాములపై నిఘా ఉంచండి. మీ ప్రవర్తనలో మార్పును మీరు గమనిస్తారు. స్నేహితుల నుంచి మంచి సహకారం ఉంటుంది. సత్కార్యాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మంచి రోజు కానుంది.

Also read:Chandrababu: ఖైదీ నంబర్ 7691

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు  జాగ్రత్తగా మాట్లాడండి. మీపై ప్రతికూలత పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అనుకున్న పనిలో జాప్యం ఒత్తిడికి దారి తీస్తుంది. మీరు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

సింహం

ఈరోజు సింహరాశి వారి ప్రభుత్వ పనుల్లో  జాప్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. భగవంతుడిని పూజించడం వల్ల బాధలు దూరమవుతాయి. ఉద్యోగుల పనితీరు బావుంటుంది. ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి. ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేస్తారు. సామాజిక జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది.

Also read: Asia Cup 2023: ఈ రోజు భారత్ పాక్ సూపర్ ఫోర్ మ్యాచ్

తుల

ఈరోజు తులారాశి వారు ఒత్తిడికి దూరంగా ఉంటారు. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకు టైమ్ కేటాయిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. స్నేహితులకు సమయం కేటాయిస్తారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులపై కోపం ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలపై తీవ్ర చర్చలు ఉంటాయి. శారీరకంగా ఇబ్బంది పడతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంటికి కొత్త అతిథి రావచ్చు.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశివారు  పనికిరాని పనుల కోసం సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఉపయోగకర పనులకే మీ సమయం వెచ్చించాలి. మీ ఒత్తిడి దూరమవుతుంది. కొన్నిరోజులుగా వెంటాడుతున్న గందరగోళం నుంచి  బయటపడతారు. భాగస్వామ్య వ్యాపారం బాగానే సాగుతుంది.

మకరం

ఈరోజు మకర రాశి వారి మనసులో ఆలోచనలు మారుతాయి. వ్యాపారంలో అజాగ్రత్తగా ఉండకండి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితం పొందుతారు.  ఉద్యోగులు ఉన్నతాధికారులను కలుస్తారు. కెరీర్ కి సంబంధించిన నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Also read: CBN – House Arrest Petition : చంద్రబాబు ‘హౌస్ అరెస్ట్’ పిటిషన్ పై విచారణ నేడే.. సర్వత్రా ఉత్కంఠ

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో వ్యాపార సంబంధాలను పెట్టుకోవద్దు. సాంకేతిక సాధనాలను జాగ్రత్తగా వినియోగించాలి. ఇలాంటి విషయాల్లో నిపుణులను సంప్రదించి వారి సహకారాన్ని తీసుకోవాలి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తారు.

మీనం 

ఈరోజు మీన రాశి వారు కారణం లేకుండా ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు.కుటుంబంలో కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులకు ఇది శుభసమయం. కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.