Tiger Killed Tiger : సంతానోత్పత్తికి ప్రయత్నిస్తున్న పులిని చంపిన మరో పులి..!!

  • Written By:
  • Updated On - November 17, 2022 / 05:26 PM IST

పులికి కోపం వచ్చింది. మరో పులికి చంపేసింది. అవును సంతానోత్పత్తికి ప్రయత్నిస్తున్న సమయంలో పులి కోపం వచ్చి మరో పులిని దారుణంగా చంపేసింది. బ్రిటన్ లోని నోస్లీ సఫారీ పార్క్ లో ఈ ఘటన జరిగింది. పులి మరో పులిని చంపేస్తుంటే…సఫారీ పార్క్ సిబ్బంది చూస్తూ ఉండటం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి.

ఈ దాడిలో 8ఏళ్ల పులి మిరాన్ ను 14 ఏళ్ల పులి సిందా చంపేసిందని నోస్లే సఫారీ ప్రతినిధి తెలిపాడు. సైబీరియన్ టైగర్ సిందా 12ఏళ్లగా పార్కులో ఉంటుందని..తెలిపారు. ఆ పులితో మాకు 12ఏళ్ల అనుబంధం ఉంది…ఇప్పుడు అది మరణించడం చాలా బాధగా ఉందంటూ పార్క్ సిబ్బంది తెలిపారు.

కాగా సైబీరియన్ పులి జీవితకాలం 15ఏళ్లు. అయితే ఈ జాతికి చెందిన పులిని బోనులో లేదా బయట ఉంచితే మరో 10ఏళ్లు జీవిస్తుంది. మిరాన్ 2020లో పార్క్ కు తీసుకువచ్చారు. సంతానోత్పత్తికి కోసం చాలా సందర్భాల్లో సిందాతో మిరాన్ ను కలిసి ఉంచినట్లు సిబ్బంది తెలిపారు. అయితే మిరాన్ కు కోపం వచ్చిన సిందాపై దాడికి దిగింది. కానీ ఆ సమయంలో మేము ఏం చేయలేకపోయామని సిబ్బంది అన్నారు. ఇంతకు ముందు ఈ రెండు పులల మధ్య సంతానోత్పత్తి జరిగినప్పుడు ఎప్పుడూ ఇలాంటి కోపాన్ని ప్రదర్శించలేదన్నారు.