ఓ వ్యక్తి..యువతిని దాదాపు 14 ఏళ్లుగా రూమ్ లో బందించి ఆమెను శృంగారానికి బానిసగా మార్చుకున్నాడు..ఒకటి , రెండు సార్లు కాదు ఏకంగా ఆమెపై వెయ్యి సార్లు అత్యాచారానికి పాల్పడి హింసించాడు. ప్రతిఘటిస్తే తీవ్రంగా కొట్టేవాడు..ఈమెనే కాదు పలువురు యువతులను కూడా ఇలాగే బందించి కామ కోర్కెలు తీర్చుకున్నాడు. ఈ ఘటన రష్యాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ రష్యాలో వ్లాదిమిర్ చెస్కిడోవ్ (Vladimir Cheskidov) (51) అనే వ్యక్తి..2009 లో కటెరినా (19) అనే యువతిని ఇంటికి ఆల్కహాల్ పార్టీకి పిలిచాడు. దాంతో ఈమె ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఆమెను రూమ్ లో వేసి నిర్బదించాడు. అప్పటి నుండి ఆమెఫై అత్యాచారం చేయడం..హింసించడం చేస్తూ వచ్చాడు. దాదాపు 1000 సార్లు ఆమెను అత్యాచారం చేసాడు. ఈ నిందితుడికి తల్లి కూడా సహకరించింది. ఇద్దరు కలిసి ఎకటెరినా హింసిస్తూ వచ్చారు.
ప్రస్తుతం వ్లాదిమిర్ చెస్కిడోవ్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. ఈ కారణంతో హాస్పటల్ కు వెళ్లాడు. ఈ క్రమంలో బాధిత మహిళకు చెస్కిడోవ్ తల్లి బయటకు పారిపోవడానికి సహాయం చేసింది. దీంతో ఎకటెరినా బయటకు వచ్చి పోలీసులకు జరిగిన ఉదంతాన్ని వివరించింది. ఈమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడితో పాటు అతడి 72 ఏళ్ల తల్లినీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు.
తాను అత్యాచారం (Raped ) చేశానన్న మాట అవాస్తవమని, ఆమెపై ఎంతో ప్రేమ ఉందని కోర్టుకి తెలిపాడు నిందితుడు. అయితే..నిందితుడి ఇంట్లో సోదాలు చేయగా..అభ్యంతరకరమైన వీడియో సీడీలను లభించాయి. అలాగే సెల్లార్‌లో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. దీనిపై విచారించగా…2011లో చెస్కిడోవ్ ఓ మహిళను హత్య చేశాడని బాధితురాలు చెప్పింది. బాడీని డీకంపోజ్ చేయడానికి సాయం చేయాలని బలవంతం చేశాడని వివరించింది. ఆ చనిపోయిన మహిళ మరెవరో కాదని, అతడి భార్యేనని వెల్లడించింది. ప్రస్తుతం కోర్ట్ నిందితుడ్ని మరింత లోతుగా విచారించాలని ఆదేశించింది.
Read Also : Pawan Russia File:రష్యా ఫైల్`బ్రో`!ఢిల్లీలో అంబ`ఢీ`!!