తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) ఖమ్మం (Khammam) జిల్లా సత్తా చాటింది. ఏకంగా 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించి మరోసారి ఖమ్మం గడ్డ..కాంగ్రెస్ అడ్డాగా వార్తల్లో నిలిచింది. అంతే కాదు ఈ జిల్లా నుండి ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. మధిర నుండి విజయం సాధించిన భట్టి విక్రమార్క (Bhatti) కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్ధిక మంత్రి శాఖ దక్కింది. ఖమ్మం నుండి విజయం సాధించిన తుమ్మల (Thummala) కు వ్యవసాయ శాఖ, పాలేరు నుండి విజయం సాధించిన పొంగులేటి (Ponguleti) కి రెవెన్యూ శాఖ ను కేటాయించారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి..ఆయా శాఖల్లో భాద్యతలు చేపట్టిన ఈ ముగ్గురు మంత్రులు..నేడు ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. ఈ సందర్భాంగా పార్టీ శ్రేణులు గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. నాయకన్ గూడెం వద్ద నుంచి ఖమ్మం చేరుకున్న మంత్రులు.. కొత్తగూడెం వెళ్లి అక్కడ నుండి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Read Also : Medaram Jatara 2024 : ఫిబ్రవరిలోనే మేడారం జాతర.. అభివృద్ధి పనుల ఊసేది ?