Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని వ్యాఖ్యానించారు. మైనంపల్లి రోహిత్ త్వరలోనే మంత్రి పదవి చేపట్టాలని తాను కోరుకుంటున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. […]

Published By: HashtagU Telugu Desk
Mynampalli Rohith

Mynampalli Rohith

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని వ్యాఖ్యానించారు. మైనంపల్లి రోహిత్ త్వరలోనే మంత్రి పదవి చేపట్టాలని తాను కోరుకుంటున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, అభివృద్ధిపై దృష్టి, యువ నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని అన్నారు. మెదక్ ప్రజలు మైనంపల్లి రోహిత్‌ను మరింత బలంగా ఆదరించి, భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. రోహిత్ నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే సామర్థ్యం ఉన్న నాయకుడిగా రోహిత్‌ను అభివర్ణించిన జగ్గారెడ్డి, ఆయన ప్రజాసేవను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.

  Last Updated: 31 May 2026, 07:04 PM IST