ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీనటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వెళ్తున్న సందర్భంగా ఖర్గే హైదరాబాద్‌లో ఆగగా, ఈ సమావేశం జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రవేశపెడుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ పథకాన్ని ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారు. ట్రస్ట్‌లో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉండగా, ఉద్యోగుల సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. 3.56 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.07 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకం కింద అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, 652 ఎంపానెల్‌డ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి క్యాష్‌లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 1,998 వైద్య ప్రక్రియలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఉద్యోగులు తమ మూల వేతనంలో 1.5 శాతం చొప్పున వాటా చెల్లించనుండగా, ప్రభుత్వం కూడా సమాన మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ పథకం అమలుకు సంవత్సరానికి రూ.1,056 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీనటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వెళ్తున్న సందర్భంగా […]

T Congress
Last Updated: 31 May 2026, 04:32 PM IST