హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) ఐపీఎల్ (IPL) అభిమానులకు మరో విశేషాన్ని అందించనుంది. ఎల్లుండి జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (SRH vs LSG ) మ్యాచ్‌కు ముందుగా ప్రఖ్యాత సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక సంగీత ప్రదర్శన (Thaman Musical Event) ఇవ్వనున్నారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం ఈ మ్యూజికల్ ఈవెంట్ అదనపు వినోదంగా నిలవనుంది. తమన్ తన ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నారు.
Muslim Population: 2070 నాటికి అతిపెద్ద మతంగా ఇస్లాం.. నివేదిక ప్రకారం షాకింగ్ విషయాలు?
ఐపీఎల్ 2024ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు బీసీసీఐ వివిధ స్టేడియాల్లో మ్యూజికల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో విజయవంతమైన ఈ కార్యక్రమం ఉప్పల్‌లోనూ ఘనంగా జరిగే అవకాశముంది. మ్యాచ్‌కు ముందు సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆ తర్వాత హై ఓక్టేన్ క్రికెట్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు దొరకడం విశేషం. తమన్ తన మ్యూజిక్‌తో స్టేడియం మొత్తాన్ని హీటప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
MLAs Defection Case : నేడు ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ..!
ఈవెంట్‌కు సంబంధించిన సమాచారం ఐపీఎల్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడైంది. అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు మాత్రమే కాకుండా, తమన్ మ్యూజికల్ షోను ఆస్వాదించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. టిక్కెట్లు ఇప్పటికే వేగంగా అమ్ముడవుతున్నాయి. క్రీడాభిమానులకే కాదు, సంగీత ప్రియులకూ ఇది డబుల్ ట్రీట్ కానుంది. ఉప్పల్ స్టేడియం ఒక అద్భుతమైన క్రికెట్ మరియు మ్యూజిక్ ఫెస్టివల్ వేదికగా మారనుంది.