England: భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ (నిర్దేశిత ఓవర్లను సమయానికి వేయకపోవడం) కారణంగా ఇంగ్లండ్ (England) జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో రెండు పాయింట్లు కోత విధించబడింది. దీంతో ఇంగ్లండ్ WTC పాయింట్ల టేబుల్‌లో ఒక స్థానం దిగజారి మూడవ స్థానానికి చేరుకుంది.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో భారత్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించినప్పటికీ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆటగాళ్లపై మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించబడింది. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఈ శిక్షను విధించారు. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టు నిర్దేశిత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది.
Also Read: Nimisha Priya: నిమిషా ప్రియా కేసులో బిగ్ ట్విస్ట్.. మరణశిక్ష తప్పేలా లేదు, ఎందుకంటే?
ఐసీసీ తన ప్రకటనలో ఇలా పేర్కొంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కోసం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్దేశిత సమయంలో ఓవర్‌ను వేయని ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించబడుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడే నిబంధనల ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. ప్రతి ఓవర్ తక్కువగా వేయడానికి ఒక పాయింట్ కోత విధించబడుతుంది. ఈ కారణంగా ఇంగ్లండ్ జట్టు నుండి రెండు WTC పాయింట్లు తొలగించబడ్డాయని పేర్కొంది.
Also Read: PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!
ఈ కోత తర్వాత ఇంగ్లండ్ WTC పాయింట్లు 24 నుండి 22కి (మొత్తం 36 పాయింట్లలో) తగ్గాయి. దీంతో వారి పాయింట్ శాతం (PCT) 66.67% నుండి 61.11%కి తగ్గింది. ఫలితంగా శ్రీలంక (66.67% PCT) ఇంగ్లండ్‌ను అధిగమించి రెండవ స్థానాన్ని సంపాదించింది. ఆస్ట్రేలియా WTC టేబుల్‌లో 100% PCTతో అగ్రస్థానంలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లను గెలిచారు. భారత్ ప్రస్తుతం 33.33% PCTతో నాల్గవ స్థానంలో ఉంది.