IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గెలిచి గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్‌కి చేరుకుంది. కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్‌ అద్భుత శతకంతో మెరిసి గుజ‌రాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై ఘన విజయం సాధించింది 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 […]

Published By: HashtagU Telugu Desk
IPL 2026

IPL 2026

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గెలిచి గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్‌కి చేరుకుంది. కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్‌ అద్భుత శతకంతో మెరిసి గుజ‌రాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై ఘన విజయం సాధించింది 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. గిల్‌కు తోడుగా సాయిసుద‌ర్శ‌న్‌ 32 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. యువ సంచలనం వైభ‌వ్ సూర్య‌వంశీ 96 పరుగులతో త‌న స‌త్తా చాటారు. ఫెరీరా 38 (నాటౌట్), జ‌డేజా 45 (నాటౌట్ )పరుగులతో జట్టును భారీ స్కోరుకు చేర్చారు. అయితే గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట్‌మ‌న్స్‌ ఆరంభంలోనే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ల‌పై చెల‌రేగిపోయారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 ఫైనల్‌లోకి దూసుకెళ్లి ట్రోఫీకి మరో అడుగు దూరంలో నిలిచింది.

  Last Updated: 29 May 2026, 11:53 PM IST