Tragic : ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో బక్రీద్ పండుగ వేళ ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇస్ముహమ్మద్ అన్సారీ అనే వ్యక్తి, మేకలను బలిచేయడానికి ఉపయోగించే భుజలి అనే పదునైన ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఈ ఘటన వెనుక ఉన్న మనోభావాలను బయటపెట్టింది.
ఇస్ముహమ్మద్ తన సూసైడ్ నోట్‌లో “నేను అల్లాహ్ దూత పేరుతో నన్ను నేను బలి ఇస్తున్నాను. మేకలు, మనుషులు రెండూ జీవులే. ఒక మనిషి మేకను ఎలా త్యాగం చేస్తాడో, అల్లాహ్ కోసం మనల్ని మనమే త్యాగం చేసుకోవాలి,” అని పేర్కొన్నాడు. ఆ నోట్‌లో తనను ఎవరూ హత్య చేయలేదని, స్వచ్ఛందంగా బలి ఇచ్చుకుంటున్నానని స్పష్టం చేశాడు. అంతేకాదు, తన సమాధి ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా వివరించాడు.
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతను ఎలా ప్రకటిస్తారు?
అంతేకాదు, ఈ సంఘటనపై అన్సారీ భార్య హజ్రా ఖాటూన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, అన్సారీకి గత కొన్ని రోజులుగా దయ్యాల భయం కలిగినట్లు కనిపించిందని, తరచూ అజంగఢ్ దర్గాను సందర్శించేవాడని వెల్లడించింది. మృతికి మూడు రోజుల ముందే దర్గా నుంచి తిరిగినట్లు తెలిపింది. శనివారం ఉదయం ఇంట్లో ధూపం వెలిగించి తంత్ర మంత్రాలు చేసిన తర్వాత, ఒక్కసారిగా అతను రక్తంలో తడిసి పడిపోయాడని పేర్కొంది. అప్పటికి భుజలి పక్కనే పడివుండటాన్ని గుర్తించిన ఆమె, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
పోలీసులు గాయపడిన అన్సారిని డియోరియా మెడికల్ కాలేజీకి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి పంపించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ, “ప్రాథమికంగా అన్సారీ తనను తాను గాయపరచుకున్నాడనే స్పష్టత వచ్చింది. కానీ మేము అన్ని కోణాల నుంచి విచారణ కొనసాగిస్తున్నాం,” అని తెలిపారు.
ఈ ఘటన సామాజిక, మతపరంగా విస్తృత చర్చకు దారితీసే అవకాశముంది. మతపరమైన భావోద్వేగాలు, తాంత్రిక అనుభూతులు కలిసి, ఒక జీవితం ముగియడానికి కారణమయ్యాయన్న మాట. ఇది సమాజానికి ఓ బలమైన హెచ్చరిక కావచ్చు.
Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత