Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్‌హౌస్‌పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. […]

Published By: HashtagU Telugu Desk
Zepto

Zepto

హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్‌హౌస్‌పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. గడువు ముగిసిన నమ్‌కీన్ ఉత్పత్తులు రెండుసార్లు డెలివరీ అయ్యాయని ఒక వినియోగదారుడు H-FAST హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు వెంటనే స్పందించింది, ఫిర్యాదు అందుకున్న అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఫుడ్ సేఫ్టీ అధికారిణి రాజేశ్వరి సహకారంతో గిడ్డంగిలో సోదాలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై గిడ్డంగి యాజమాన్యానికి GHMC అధికారులు నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆన్‌లైన్ గ్రోసరీ మరియు క్విక్ కామర్స్ సేవలను వినియోగించే ప్రజలు ఉత్పత్తుల గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు

  Last Updated: 20 Jun 2026, 07:22 AM IST