Site icon HashtagU Telugu

Suicide : భార్య వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Student Suicide

Student Suicide

హైదరాబాద్‌(Hyderabad)లో భార్య, అత్త వేధింపులు తట్టుకోలేక అబ్దుల్ జమీర్ (Abdul Zamir) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య (Software engineer commits suicide) చేసుకున్న ఘటన కలకలం రేపింది. జమీర్ కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, తన భార్య, అత్త తరచుగా వేధిస్తున్నారని స్నేహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. శనివారం తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tabebuia Rosea : హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న ‘పింక్ ఫ్లవర్’ చెట్లు

అబ్దుల్ జమీర్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో అతని భార్య, అత్త ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతను చనిపోయిన అనంతరం వారు అనంతపురానికి వెళ్లిపోయారు. ఇంట్లో నుంచి చెడువాసన రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.

Araku Coffee Stall : అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

భార్యల వేధింపులతో భర్తలు మానసికంగా కుంగిపోతున్న సంఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అబ్దుల్ మృతి విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, అతని స్నేహితులు, కుటుంబసభ్యుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ ఘటన సంచలనంగా మారడంతో, కుటుంబ కలహాల పరిష్కారానికి సమాజంలో చర్చనీయాంశం అవుతోంది.