Telangana Movement: తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల సేకరణ

తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సేకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటె పంపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కోరింది

Published By: HashtagU Telugu Desk
Telangana Movement

New Web Story Copy 2023 06 27t212711.952

Telangana Movement: తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సేకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటె పంపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కోరింది. జూలై 5లోపు సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ కార్యాలయానికి పంపవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అపూర్వమని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ కె. అశోక్ రెడ్డి అన్నారు. మరిన్ని వివరాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్ జి బిమల్ దేవ్‌ను 9949351523 నంబర్‌లో లేదా adphoto.ts@gmail.com అనే మెయిల్ ద్వారా సంప్రదించాల్సిందిగా పేర్కొంది. రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధాల వేడుకలు ముగిసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాలు జూన్ 2న ప్రారంభమై జూన్ 22న లుంబినీ పార్క్ దగ్గర అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముగిశాయి.

Read More: Etela Rajender: బీఆర్ఎస్​ను కొట్టేది భాజపానే

  Last Updated: 27 Jun 2023, 09:28 PM IST