Site icon HashtagU Telugu

Viral News : సభ్యసమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. కొడకు ఏం చేశాడంటే..!

Marriage

Marriage

Viral News : ప్రేమకు వయసు, కుల, మతం, వావీ వరసలు లేవని చాలామంది చెబుతుంటారు. కానీ, ఈ మాటలను నిజం చేస్తూ ఒక విచిత్రమైన సంఘటన మనం చూసే, వినే ఉంటాం. అయితే.. మనం ఇప్పుడు చూసే జంట విషయంలో ఇవన్నీ మరీ అనవసరం అయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ఒక తండ్రి తన కొడుక్కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు, కానీ పెళ్లి నిశ్చయమైన అనంతరం తాను చక్కగా అమర్చిన కుటుంబాన్ని షాక్‌కు గురి చేసిన సంఘటన జరిగింది. ఇలాంటి వివాహపు కథ ఇంతవరకు ఎక్కడా వినలేదు.

నాసిక్‌కు చెందిన ఓ తండ్రి తన కొడుక్కు ఓ అందమైన అమ్మాయిని చూపించి పెళ్లి నిశ్చయించాడు. ఆమె తన కోడలే భావించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూపించాడు. అమ్మాయికి, అబ్బాయికి నచ్చడంతో పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యింది. కానీ, ఈ క్రమంలో కొడుకుతో పాటు తండ్రికి కూడా ఆ అమ్మాయి చాలా అందంగా కనిపించడం కొసమెరుపు. అయితే.. తనకు కాబోయే భార్య ఎంతో అందంగా ఉందని.. పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని గడపాలనుకున్నారు ఆ కుర్రాడు. ఈక్రమంలోనే పెళ్లి ఏర్పాట్లలో జోరుగా పనులు చూసుకుంటూ అతను మురిసిపోయాడు.

Chandrababu In Naravaripalle : బుధవారం వరకు నారావారిపల్లెలోనే చంద్రబాబు.. భోగి శుభాకాంక్షలు చెప్పిన సీఎం

ఒక రోజు, పెళ్లి ముందు తండ్రి కుమారుడిని ఆశ్చర్యపరిచేలా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి కాబోయే కోడలిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసిన కుమారుడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు. ప్రశ్నించగా, తండ్రి మాట్లాడుతూ, “నేను ఆమెతో ప్రేమలో పడ్డాను” అని చెప్పాడు. అంతే కాకుండా, కాబోయే వధువు కూడా తనకు నచ్చడం వల్లే ఈ వివాహం జరిగిందని ప్రకటించింది.

ఈ సంచలనాత్మక పరిణామంతో, యువకుడు తండ్రితో సహజంగా కలిసి ఉండాలనుకోవడం లేదు. తండ్రి పై తీవ్ర అసహ్యం ఏర్పడింది. తన కోడలితో వివాహం చేసుకున్న తండ్రి నుండి విడిపోవాలని అతను నిర్ణయించుకున్నాడు. తండ్రి తనకు మరో పెళ్లి చేస్తానని చెప్పినా.. అతడు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. “నువ్వు చేసిన నమ్మక ద్రోహంతో, నాకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది” అని కంటతడి పెట్టి చెప్పిన కొడుకు, “ఇప్పుడు నేను జీవితాంతం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను,” అని ప్రకటించాడు.

సన్యాసం తీసుకోబోతున్న యువకుడు

కొడుకు తన నిర్ణయాన్ని మరింత బలంగా ప్రకటించి, “నేను సన్యాసం తీసుకోబోతున్నాను,” అని వెల్లడించాడు. బంధువులు అతడిని ఒప్పించడానికి వచ్చారు, “మీరు మరో పెళ్లి చేసుకోండి,” అని చెప్పినా, అతడు ఎవరి మాట వినడం లేదు. చివరికి, అతడు సన్యాసాన్ని ఎంచుకొని, ఒంటరి జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు.

Makar Sankranti : ఈ 5 దక్షిణ భారతీయ వంటకాలతో పొంగల్‌ను జరుపుకోండి..! పండుగ మజా రెట్టింపు అవుతుంది..!