LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా పణ్వేల్ తాలూకాలోని ‘హెచ్‌పీసీఎల్ పాతాళగంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్’ నీటమునిగింది. దీంతో నింపినవి, ఖాళీవి కలిపి సుమారు 3,000 సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి పాతాళగంగా నదిలోకి చేరాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలో లేదా ఒడ్డున కొట్టుకొచ్చిన సిలిండర్లు కనిపించినా వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దని సూచించారు. ఇంటికి తీసుకెళ్లొద్దని హెచ్చరించారు. వాటిలో గ్యాస్ […]

Published By: HashtagU Telugu Desk
3,000 LPG gas cylinders washing in due to heavy rains.

3,000 LPG gas cylinders washing in due to heavy rains.

మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా పణ్వేల్ తాలూకాలోని ‘హెచ్‌పీసీఎల్ పాతాళగంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్’ నీటమునిగింది. దీంతో నింపినవి, ఖాళీవి కలిపి సుమారు 3,000 సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి పాతాళగంగా నదిలోకి చేరాయి.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలో లేదా ఒడ్డున కొట్టుకొచ్చిన సిలిండర్లు కనిపించినా వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దని సూచించారు. ఇంటికి తీసుకెళ్లొద్దని హెచ్చరించారు. వాటిలో గ్యాస్ ఉందో లేదో, అవి సురక్షిత స్థితిలో ఉన్నాయో లేదో తెలియదని వెల్లడించారు. వాటిని తెరవడం లేదా వినియోగించడం ప్రమాదకరమని పేర్కొన్నారు.

వరదల్లో కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నదిలో లేదా పరిసర ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

  Last Updated: 09 Jul 2026, 10:39 AM IST