YCP Chaos: త్రిబుల్ ఆర్ బాటన వసంత! వైసీపీలో కల్లోలం!

వైసీపీ ఎంపీ త్రిబుల్ ఆర్ మాదిరిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వాయిస్ పెంచారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని అంటూ వ్యక్తిగత అభిప్రాయాన్ని కుండబద్దలు

Published By: HashtagU Telugu Desk
Triple R Batana Vasantha Chaos In Ycp

Triple R Batana Vasantha Chaos In Ycp

వైసీపీ ఎంపీ త్రిబుల్ ఆర్ మాదిరిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వాయిస్ పెంచారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని అంటూ వ్యక్తిగత అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తరచూ YCP పెద్దలకు ఝలక్ ఇస్తున్న వసంత తాజాగా సొంత పార్టీలో బ్లేడ్ బ్యాచ్ , చెడ్డీ గ్యాంగులు ,తొట్టి గ్యాంగులు ఉన్నారని వ్యాఖ్యానించటం వైసీపీని కల్లోల పరుస్తుంది. మైలవరం నియోజకవర్గంలో జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామంలో ఎం.పీ.ఎఫ్.సీ గోడౌన్కేడీసీసీ బ్యాంక్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో YCP ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన హాట్ హాట్ కామెంట్స్ తాడేపల్లికి తాకినట్టు వినికిడి.

సొంత నియోజకవర్గంలోనే విపక్షం తయారు అయిందని మధన పడుతున్నారు. ఆయన ఉద్దేశ్యం విమర్శలు అన్నీ కూడా మంత్రి జోగి రమేష్ మీదనే. విపక్షాలకు తనను అనే ధైర్యం ఎక్కడిది అని ఆయన అంటూనే సొంత వారే కోతి మూకల మాదిరిగా చేస్తున్న చర్యలను తప్పుబట్టారు. అంతే కాదు ఇలాంటి వాళ్ళను అధిష్టానం కూడా పట్టించుకోదని జగన్మోహన్ రెడ్డి మీద చురక వేశారు. ఆయనతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు కూడా వసంతకు మద్దతుగా మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు ఓటమి లేదని అలాంటి ఆయన్ని ఏకంగా పన్నెండు వేల పై చిలుకు మెజారిటీతో ఓడించిన ఘనత వసంతకే దక్కుతుందని అన్నారు. వైఎస్సార్ కాలం నుంచి చిత్తశుద్ధితో పనిచేసే నేత వసంత అన్నారు.

మరోసారి మైలవరం నుంచి వసంత పోటీ చేసి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే వేలూ కాలూ పెట్టరని అవతల వారూ అలాగే ఉండాలి ఆయన కోరుతున్నారు. ఇంతకీ వసంత మాటలు అన్నీ మంత్రి జోగి రమేష్ మీదనేనా. వాటిని ఆయన ఎలా తీసుకుంటారో మరెలా రియాక్ట్ అవుతారో అంటూ వైసీపీ బాచ్ చూస్తోంది. ఇటీవల వసంతను దగ్గరకు పిలిపించుకుని జగన్ మాట్లాడి హామీ ఇచ్చాక కూడా సొంత పార్టీ మీద కామెంట్స్ చేయడం మానడంలేదు. ఆ మధ్య దాకా మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తారని అనుకున్నారు. కానీ ఆయన వైసీపీలో ఉంటానని చెబుతున్నారు. అదే టైం లో జోరు, నోరు పెంచారు. అయితే ఆయన జోరు బాగున్నా నోరు మాత్రం వైసీపీని ఇబ్బందులో పడేస్తోంది.

సొంతజ పార్టీ అంటూనే YCP దారుణంగా ఓడిపోతుంది అని ఆయన చెబుతారు. ఎమ్మెల్యేలలో రెబెల్స్ కొత్తగా బయల్దేరుతున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు YCP ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ నారాయణరెడ్డి ప్రభుత్వం మీద ధాటీగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు సొంత పార్టీలో మరో ఎమ్మెల్యే వసంత సౌండ్ చేస్తున్నారు. అంటే ఏదో పార్టీలో జరగబోతుందని త్రిబుల్ ఆర్ చెప్పిన జ్యోస్యం ఫలిస్తుందా? అనేది చూడాలి.

Also Read:  Kavitha: మోడీ ముందు కవిత కుప్పిగంతులు

  Last Updated: 10 Mar 2023, 11:06 AM IST