Site icon HashtagU Telugu

Shyamala : అప్పుడే దూకుడు పెంచిన శ్యామల..చంద్రబాబు పై ఫైర్

Shyamala Bhajana

Shyamala Bhajana

YCP Party Representative Shyamala : యాంకర్ శ్యామల ( Anchor Syamala)కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి (YCP Party Representative Shyamala) ఇచ్చారో లేదో..అప్పుడే అధికార పార్టీ పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (PawanKalyan) పై విమర్శలు చేసింది. ముసలి తోడేలు, గుంట నక్క కథ చెప్పింది. ఇది పరోక్షంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించినదేనంటూ రెండు పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. తీరా ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి రావడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమెస్తోందని తనను బతకనీయండి అన్నా అంటూ శ్యామల ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత చిత్రసీమకు దూరమైనప్పటికీ ఆమె తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. జగన్ పార్టీ లో పోస్ట్ ఇవ్వడం ఆలస్యం తన నోటికి పనిచెప్పడం మొదలుపెట్టింది.

ప్రజలకు సాయం చేసే విషయంలో జగన్ పిల్లికి కూడా బిచ్చం వేయని చంద్రబాబు, నారా లోకేష్‌ల సన్నాయి నొక్కులు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావడం లేదు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు పైగా సంపాదించుకున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎంతమందికి సాయపడ్డారని శ్యామల ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతీకార దాడుల్లో నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ సాయాన్ని అందించారని ఆమె తెలిపారు. విశాఖలోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే.. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడ్డ 41 మందికి లక్ష చొప్పున జగన్ సాయం అందించారని శ్యామల చెప్పుకొచ్చింది. విజయవాడలోని వరద బాధితులకు ఇప్పటికీ సాయం అందుతోందని, పులివెందులోని వెంకటప్ప స్కూల్‌లో ఎంతో మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మరి శ్యామల వ్యాఖ్యలకు టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

Read Also : Spirituality: మాంసాహారం తిని దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదో తెలుసా?