2019 ఎన్నికల ముందు మాజీమంత్రి వివేకానందరెడ్డి ని హత్య (Y.S. Vivekananda Reddy murder case) చేసి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. వివేకా హత్య ఘటనను మనం లోతుగా అర్ధం చేసుకోవాలి. రాజకీయాల్లో ఉండే క్రిమినల్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో, కుట్రలు ఎలా ఉంటాయో ఆ ఘటన మనకు తెలియజేస్తుంది. వివేకా హత్యకు గురైతే గుండెపోటు అని సాక్షిలో బ్రేకింగ్ న్యూస్ వేశారు. మేం కూడా వాస్తవమేమో అనుకున్నాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు పట్టించుకోలేదు. నేను కూడా పట్టించుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో నాడు మనం కూడా టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నాం.
నిజంగా గుండెపోటు ఏమో అని ముందుగా అనుకున్నాం. హత్య జరిగిన రోజున హైదరాబాద్‌లో తెల్లవారుజామున 5 గంటలకు మేనిఫెస్టో తయారు చేస్తున్నామని అజయ్ కల్లం చెప్పారు. ఆ సమయంలో ఫోను వస్తే జగన్ పైకి వెళ్లి మాట్లాడొచ్చి చిన్నాన్న చనపోయారని చెప్పి సమావేశం కొనసాగించారని చెప్పారు. హత్య చేశాక ప్లాన్ ప్రకారం బెడ్ రూమ్, బాత్రూమ్‌లో రక్తం లేకుండా శుభ్రం చేశారు. రక్తం మరకుల, దాడి ఆనవాళ్లు ఉండడంతో ఆయన కుమార్తె సునీతారెడ్డి పోస్టుమార్టం చేయాలని ఎస్పీని అడిగారు.
దీంతో మళ్లీ వాళ్లు గొడ్డలి పోటు అని…అది మనం చేయించామని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు చంపారని ప్రచారం చేశారు. సాయంత్రానికి జగన్ వచ్చి మా నాన్నను చంపారు, ఇప్పుడు బాబాయిని కూడా చంపారు అని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కావడంతో రాజకీయ లబ్దికోసం నీచమైన ఆరోపణలు చేశారు. మరుసటిరోజున సాక్షిలో నా చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని పెద్ద వార్త రాశారు. హత్య గురించి ఎక్కడా ఎవరూ మాట్లాడకుండా, వాస్తవాలు బయటకు రాకుండా వాళ్లే కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు.
ఎన్నికల ముందు సిబిఐ దర్యాప్తు కావాలన్ని జగన్….అధికారం వచ్చిన తరువాత సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పారు. అప్పుడు సునీతారెడ్డికి పూర్తి అనుమానం వచ్చి పోరాటం మొదలుపెట్టారు. ఆ హత్య, పరిణామాలు కూడా నాటి ఎన్నికల్లో ప్రతి కూల ఫలితాలకు ఒక ప్రధాన కారణం అయ్యింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా వారి కుట్రలను పసిగట్టలేకపోయింది. కుట్రలను అంచనా వేయలేక నాడు నష్టపోయాం. ఏ మాత్రం అలెర్ట్ గా ఉన్నా నాడు నిందితులను అరెస్టు చేసేవాళ్లం. మళ్లీ మొన్నటి ఎన్నికల ముందు గులకరాయి నాటకం ఆడారు. దాన్ని గట్టిగా తిప్పి కొట్టాం…..దీంతో వాళ్ల డ్రామాలు జనం నమ్మలేదు. ఇటీవల జగన్ ఇంటి ముందు గడ్డి తగలబడింది.
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
దానిపై వైసీపీ నేతలు నానాయాగీ చేశారు. సీపీ ఫుటేజీ ఇవ్వండి అంటే లేవు, అవి డమ్మీవి అని మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ వస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. క్రిమినల్ ఆలోచనలతో ఉన్న వాళ్లు నిత్యం ఇదే తీరుతో వ్యవహరిస్తారు. మనం ఇలాంటి వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల రాజకీయ సిద్దాంతమే కుట్రలు, ఫేక్ అయినప్పుడు మనం వాటిని నిరంతరం తిప్పి కొట్టాలి.